MOVIES:సలార్ దెబ్బకు పక్కకెళ్ళిన డంకీ

టాలీవుడ్ హంక్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పక్కకు వెళ్ళిపోయారు. డిసెంబర్ 22న సలార్, డంకీ సినిమాలు రెండూ విడుదల అవనున్నాయి. అయితే ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు డంకీ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

New Update
Salaar Movie: 'సలార్' ఖాతాలో మరో రికార్డ్..దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‎లో  ఉత్తమ చిత్రంగా ఎంపిక..!!

ఇద్దరూ ఇద్దరే. ఒకరేమో పాన్ ఇండియా హీరో మరొకరేమో బాలీవుడ్ కింగ్ ఖాన్. ఇద్దరి సినిమాలు ఒకేరోజు విడుదల అయితే ఎవరి సినిమా ఆడుతుందో చెప్పడం కూడా కష్టమే. అయితే ఈసారి మాత్రం అందరూ ప్రభాస్ మూవీకే ఓటు వేస్తున్నారు. సలార్, డంకీ రెండు మూవీస్ ఒకే రోజు విడుదల అవ్వడం కష్టమే. అయినా కూడా సలార్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుందని చెబుతున్నారు.

బడ్జెట్, బిజినెస్ దృష్ట్యా సలార్, డంకీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే రెండు సినిమాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సౌత్ తో సలార్‌కు ఉన్న క్రేజ్ వల్ల డంకీ నిలవడం కష్టమే అని మళ్ళీ చెబుతున్నారు. అంతేకాదు నార్త్‌లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సలార్ మూవీ చూడ్డానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ బాలీవుడ్​లో వ్యాపారం పరంగా డంకీ మూవీకి థియేటర్స్ ఎక్కువగా దొరికే అవకాశం ఉండడంతో సలార్ కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 22 రేసు నుంచి షారుక్ డంకీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ప్రభాస్ సలార్ బాక్సాఫీస్ బరిలో సోలోగా నిలిచి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

త్వరలోనే డంకీ పోస్ట్ పోన్ పై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ మూవీ పోస్ట్ పోన్‌కు సలార్ మూవీ ఒక్కటే కారణం కాదని... డిసెంబర్ 22లోగా ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ పనులు కంప్లీట్ అవ్వడం అనుమానమేనని, అందుకే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు డిసెంబర్ 22న కాకుండా వచ్చే ఏడాది ఆరంభంలో షారుక్ డంకీ మూవీని రిలీజ్ మూవీ యూనిట్అనుకుంటోందని సమాచారం.

ఒకవేళ ఇదేకనుక నిజంగా జరిగితే సలార్ మూవీకి బాగా కలిసొచ్చినట్టే. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు సలార్ టీజర్ కూడా మూవీకి మంచి బజ్‌ను ఇచ్చింది. మామూలుగానే ప్రభాస్ కు మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తుండడంతో సలార్ కచ్చితంగా హిట్ అవుతుందని చెబుతున్నారు.

Also Read:స్టార్ వచ్చేస్తున్నాడు…ఇషాన్, సిరాజ్ డౌటే.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Dil Raju: రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?

నిర్మాత దిల్ రాజు రేపు భారీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. అయితే వంశీ పైడిపల్లి, అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రకటన ఉండబోతుందని టాక్.

author-image
By Archana
New Update
dil Raju big announcement

dil Raju big announcement

Dil Raju:  సౌత్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు. రీసెంట్ గా  'గేమ్ ఛేంజర్' దెబ్బేసిన.. ఆ తర్వాత విడుదలైన  'సంక్రాంతికి వస్తున్నాం'  సినిమా గట్టెక్కించింది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.  

దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్ 

ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ మరో అదిరిపోయే న్యూస్ చెప్పింది. రేపు దిల్ రాజు ఓ భారీ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రకటన ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

cinema-news | latest-news | dil-raju ameerkhan 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Advertisment
Advertisment
Advertisment