కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందే.. శ్వేతపత్రం విడుదల చేయండి: బీజేపీ ఎమ్మెల్యే

New Update
కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందే.. శ్వేతపత్రం విడుదల చేయండి: బీజేపీ ఎమ్మెల్యే

కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్ధిపేటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పు తీరిపోయిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత అప్పు తెచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ విధంగా అప్పు తీర్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు 3.6 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారని, వాటిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పు ఉన్నట్లా? లేనట్లా? అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు తప్పుడు అఫిడవిట్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

పాలమూరు జిల్లాలో మంత్రి కూడా ఎన్నికల ఖర్చు తప్పుగా నమోదు చేసినట్లు కోర్టులో కేసు ఉందని, పాత కరీంనగర్ కు చెందిన ఎమ్మెల్యే, జహీరాబాద్ కు చెందిన ఎంపీలు ఎన్నికల కేసులు ఎదుర్కొంటున్నారని, వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి వారితో రాజీనామాలు చేయించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, పత్తి శ్రీనివాస్, ఉపేంద్ర రావు, మల్లేశం యాదవ్, అంబటి బాలేష్ గౌడ్, విబీషన్ రెడ్డి, రమేష్ గౌడ్, వేణుగోపాల్ అరుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు అండగా ఉంటున్నానని తెలిపారు. ఐఐటీ కాన్పూర్ లో సీటు సంపాదించిన దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి గ్రామానికి చెందిన చింతల మానసకు రూ.లక్ష విలువైన ల్యాప్ టాప్ ను ఉచితంగా అందజేసినట్లు ఎమ్మెల్యే రఘునందన్ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weight Lose: ఇలా చేశారంటే వేసవిలో సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చు. 

New Update

Weight Lose: సరైన ఆహారం తీసుకుంటే వేసవిలో బరువు తగ్గడం శీతాకాలంలో కంటే సులభం అవుతుంది. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు, ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. శీతాకాలంలో బరువు తరచుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనం అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటాం. అయితే బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కాలేయం ఆరోగ్యంగా..

వేసవిలో పుచ్చకాయ సులభంగా దొరుకుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పండు. ఇందులో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సలాడ్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా వంటి తక్కువ కేలరీల ఆహారాలు సులభంగా లభిస్తాయి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు

కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది.  సలాడ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని పుదీనా, నిమ్మకాయ, బెర్రీలతో కలిపి తాగవచ్చు. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక గొప్ప ఎంపిక. ఇది శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?

(weight-lose | weight-lose-exercises | vegetable-juices-for-weight-lose | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు