/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
Khammam Gun Misfire Incident: భద్రచలంలోని చర్ల మండలం సీఆర్‌పీఎఫ్ (CRPF) క్యాంపులో విషాదం చోటుచేసుకంది. గన్ మిస్‌ఫైర్ అవ్వడంతో అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అక్కడున్న పోలీసులు ఒక్కసారిగా షాకైపోయారు. శేషగిరి అక్కడే కుప్పకూలారు. దీంతో ఆయన్ని వెంటనే భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అప్పటికీ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం మేరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హుటాహుటీనా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజంగానే గన్ మిస్‌ఫైర్ జరిగిందా లేదా.. ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో వరుస విషాదాలు.. వేర్వేరు చోట్ల ఇద్దరిపై నుంచి వెళ్లిన బస్సులు!