Hyderabad : ఎస్‌ఆర్‌నగర్ లో డ్రగ్స్ దందా.. 25మందిని పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ మహానగరంలో మత్తు మాఫియా రెచ్చిపోయింది. న్యూ ఇయర్ పార్టీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో 25 మందిని టీన్యాబ్ పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు కింగ్‌పిన్‌ను అరెస్టు చేసినట్లు డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. By srinivas 26 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి SR Nagar : హైదరాబాద్(Hyderabad) మహానగరంలో మరోసారి మత్తు మాఫియా రెచ్చిపోయింది. న్యూ ఇయర్ పార్టీ(New Year Party) కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్(Drugs) సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. ముఖ్యంగా అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్(SR Nagar) తదితర ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఈ దందా కొనసాగిస్తుండగా పోలీసులు 25 మందిని పట్టుకున్నారు. అంతేకాదు గోవా కేంద్రంగా నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు కింగ్‌పిన్‌ను టీన్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు టీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా(Sandeep Sandlya)తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని నెల్లూరుకు చెందిన ఆశిక్, డూడూ రాజేశ్ గోవా నుంచి 60 ఎస్టసీ అనే హార్డ్ డ్రగ్‌ను కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చారు. విశ్వసనీయ సమాచారంతో వారిని ఎస్‌ఆర్‌నగర్ పీఎస్ పరిధిలో అదుపులోకి తీసుకోగా.. వారి వద్ద 34ఎస్టసీ మాత్రలను స్వాధీనం చేసుకున్నాం. నిందితులను విచారించగా, గోవా నుంచి తీసుకొచ్చిన 66ఎస్టసీ డ్రగ్ మాత్రల్లో 32ఎస్టసీ మాత్రలను రేవ్ పార్టీకోసం సరఫరా చేసినట్లు వెల్లడించారు. గోవాలోని హనుమంత్‌బాబుసొ దివ్‌కర్ అలియాస్ బాబా అనే వ్యక్తి వద్ద నుంచి ఒక్కో ఎస్టసీ మాత్ర రూ.1000 నుంచి రూ.1200చొప్పున కొన్నట్లు చెప్పారని సందీప్ తెలిపారు. ఇది కూడా చదవండి : Chiranjeevi – Revanth: రేవంత్‌రెడ్డిని కలిసిన మెగాస్టార్.. ఫొటోలు, వీడియో వైరల్! అలాగే ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ఓ పబ్బులో డీజే ఆపరేటర్ సహా మొత్తం 25మంది డ్రగ్ సరఫరాదారులను గుర్తించినట్లు టీన్యాబ్ డైరెక్టర్ తెలిపారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న మొత్తం 10మందిని అదుపులోకి తీసుకుని డ్రగ్ పరీక్షలు జరపగా అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన మూత్ర నమూనాలను సేకరించి వైద్యపరీక్షలు జరిపించడంతో 12రకాల హార్డ్ డ్రగ్స్‌ను ముగ్గురు వ్యక్తులు తీసుకున్నట్లు తేలింది. దీంతో సదరు నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చడమే కాకుండా డీ ఎడిక్ట్ సెంటర్‌కు సైతం తరలించినట్లు టీన్యాబ్ డైరెక్టర్ వెల్లడించారు. ఇందులో విద్యార్థులే అధికంగా ఉండటం కలవరపెట్టే అంశమని సందీప్ వెల్లడించారు. #drugs #hyderabad #sr-nagar #sandeep-sandlya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి