Tunnel Collapse: సొరంగం కూలిన ఘటన.. ఆగిన సహాయక చర్యలు.. ఉత్తరఖాండ్‌లోని ఉత్తరకాశీలో ఇటీవల టన్నెల్ కూలీ 40 మంది కార్మికులు చిక్కుకోగా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఈ పనులు తాత్కలికంగా నిలిచిపోయాయి. డ్రిల్లింగ్ మిషన్ పనిచేయకపోవంతోనే పనులు తాత్కాలికంగా ఆగినట్లు అధికారులు తెలిపారు. By B Aravind 17 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇటీవల ఉత్తరఖాండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి అందులో 40 మంది కార్మికులు చిక్కుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజుల నుంచి సొరంగంలో చిక్కుకున్న కూలీలను సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా.. ఆ కార్మికులను కాపాడే సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రిల్లింగ్ మిషన్ మొరాయించడం వల్లే ఈ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయని అధికారులు తెలిపారు. Also Read: ఇక కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఉంటాడు… ఖర్గే చురకలు! అయితే ఈ సొరంగం డ్రిల్లింగ్ చేస్తూ ఇలా యంత్రం ఆగిపోవడం రెండోసారి. గురువారం కూడా ఓ యంత్రం డ్రిల్లింగ్ చేస్తూ మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా శుక్రవారం మరో యంత్రం ఆగిపోయింది. ఇఖ మూడో డ్రిల్లింగ్ యంత్రాన్ని అధికారులు ఇండోర్ నుంచి వాయు మార్గంలో తీసుకొస్తు్న్నారు. శనివారం ఉదయం ఈ యంత్రం ఘటనాస్థలానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. నవంబర్ 12న ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీలో చార్‌దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 4 కిలోమీటర్ల సొరంగంలోని ఓ భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టులో భాగంగా పనిచేసే 40 మంది కూలీలు చిక్కుకుపోగా.. అప్పటినుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వారిని నీటిసరఫరా కోసం ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్, ఆహార పదార్థాలను అందిస్తున్నారు. అయితే బాధితులు సురక్షింతగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. Also Read: ఎవడు ఏడ్సినా.. మళ్లీ గెలిచేది మేమే: హుజూరాబాద్ మీటింగ్ లో కేసీఆర్ #telugu-news #national-news #tunnel-collapse #uttarkhand-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి