Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! లక్ష రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..!

7th CPC, లెవల్-10 నెలవారీ పే స్కేల్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే ఛాన్స్‌ మీదే. సైంటిస్ట్ 'B' పోస్టుల భర్తీకి DRDO ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 204పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించి drdo.gov.in లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది ఆగస్టు 31.

New Update
Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! లక్ష రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..!

DRDO RECRUITMENT 2023: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్‌. రక్షణశాఖలో ఉద్యోగం పొందే ఛాన్స్‌కు డోర్లు తెరుచుకున్నాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇటీవల సైంటిస్ట్ 'B' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా వివిధ విభాగాలలో సైంటిస్ట్ 'బి' పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 204 పోస్టులను భర్తీ చేస్తుంది DRDO. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 31 లోపు drdo.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

➼ ఖాళీ వివరాలు:
204 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వీటిలో 181 ఖాళీలు DRDOలోని సైంటిస్ట్ 'బి' పోస్టులు, 11 ఖాళీలు DSTలో సైంటిస్ట్ 'బి' పోస్టులు, 6 ఖాళీలు ADA' B'లో సైంటిస్ట్/ఇంజినీర్ కోసం. CMEలో సైంటిస్ట్ 'బి'లో 6 ఖాళీలు ఉన్నాయి.

➼ వయసు:
అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు గరిష్ట వయస్సు 38 సంవత్సరాలు. SC/ST వర్గానికి, అభ్యర్థుల గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.

➼ అర్హత:
సైంటిస్ట్ ‘B’ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత విభాగంలో ఫస్ట్-క్లాస్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.E/B.Tech) పూర్తి చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్ ఆప్ సైన్స్ సైన్స్ పూర్తి చేయాలి. దీంతో పాటు సెలక్షన్ కోసం సంబంధిత విభాగాల్లో అభ్యర్థి గేట్ స్కోర్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

➼ దరఖాస్తు రుసుము:
జనరల్ (UR), EWS, OBC వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, PWD, మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.

➼ DRDO రిక్రూట్‌మెంట్ 2023: దరఖాస్తు చేయడానికి స్టెప్స్

స్టెప్ 1: అర్హతలు ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్లు rac.gov.in (click here) ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: హోమ్ పేజీలో ‘Advt. no. 145 for 204 vacancies of Scientist ‘B’ in DRDO, ADA, DST, and CME’ లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి, ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ నింపాలి. అలాగే అడిగిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

స్టెప్ 4 : తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం ఈ కాపీని ప్రింట్ తీసుకోండి.

➼ శాలరీ:
ఎంపికైన అభ్యర్థులు పే మ్యాట్రిక్స్ 7th CPC, లెవల్-10 ప్రకరాం రూ.56,100 నెలవారీ పే స్కేల్ పొందుతారు . మొత్తం చెల్లింపులు ప్రస్తుత మెట్రో సిటీ రేటు ప్రకారం నెలకు సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుంది.

➼ ఎంపిక విధానం:
DRDO రిక్రూట్‌మెంట్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం , కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థలను ఎంపిక చేస్తారు . GATE స్కోర్‌ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు RAC/DRDO ద్వారా ఢిల్లీ లేదా మరే ఇతర ప్రదేశంలో నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

Download notification PDF here

#jobs #central-government-jobs #drdo #drdo-recruitment
Advertisment
Advertisment
తాజా కథనాలు