NHAI: ఫాస్టాగ్‌ లేకపోతే...టోల్ రెట్టింపు

వాహనాల మీద ఇక మీదట ఫాస్టాగ్ కనిపించకపోతే బాదుడే అంటోంది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. ఫాస్టాగ్ అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని ఎన్‌హెచ్‌ఐ నిర్ణయించింది. టోల్ గేట్ల దగ్గర రద్దీని నియంత్రించడానికే ఈ చర్యలను చేపట్టామని తెలిపింది.

New Update
NHAI: ఫాస్టాగ్‌ లేకపోతే...టోల్ రెట్టింపు

NO Fast- Tag Vehicles: ఫాస్టాగ్‌ను వాహనాల మీద అతికించకపోవడం వలన టోల్ ప్లాజాల దగ్గర లేట్ అవుతోంది. దీని వలన ట్రాఫిక్ ఆగిపోతోంది. మిగతా వాహనదారులకు అసౌక్యం కలుగుతోంది. అందుకే ఎన్‌హెచ్‌ఐ ఫాస్టాగ్‌ను అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్‌ వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటూ కొన్ని రూల్స్‌ను కూడా పెట్టింది. వాహనాల మీద అద్దంపై ఫాస్టాగ్‌ అతికించకుండా టోల్‌ దాటేవారికి విధించే ఫైన్‌కు సంబంధించిన సమాచారాన్ని టోల్ ప్లాజాల ప్రవేశ మార్గాల్లో ముందే చూపెట్టాలి. ఫాస్టాగ్‌ లేని వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో కూడిన సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచాలి. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయితే టోల్‌ లైనులో వాహనం వెళ్లినట్లు నిర్ధారిచుకునేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది.

వాహనం లోపల నుంచి ఫాస్టాగ్‌ను అతికించడంపై గతంలో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయడమే లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఏఐ ఈ చర్యలు చేపడుతోంది. రూల్స్ ప్రకారం ఫాస్టాగ్‌ను అతికించని వాహనాలకు రెట్టింపు టోల్‌ విధించడంతోపాటు వాటిని బ్లాక్‌లిస్ట్‌లో కూడా పెట్టే అవకాశం ఉదని తెలిపింది ఎన్‌హెచ్‌ఐ. వాహనదారులతో పాటూ ఫాస్టాగ్‌లను ఇచ్చే బ్యాంకులు కూడా వాహనంపై నిర్దేశించిన చోట వాటిని అతికించేలా చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సూచించింది.

Also Read:Andhra Pradesh: రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు