Food Tips: కిందపడిన ఆహార పదార్థాలు తింటే అంతే సంగతి! కిందపడిన ఆహార పదార్థాలను అసలు తినకూడదు. ఫుడ్ ఐటెమ్స్ కిందపడగానే వాటిని సూక్ష్మజీవులు చుట్టుముడతాయి. ఆహారం కిందపడిన సెకన్లలోపు తినవచ్చని అని చెబుతారు కానీ.. అది కూడా ఇంట్లో నేల శుభ్రంగా ఉంటేనే..! అలా తినడం కూడా ప్రతీసారి కరెక్ట్ కాదు. By Vijaya Nimma 24 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మనం ఏదైనా ఆహార పదార్థాలు తింటున్నప్పుడు అనుకోకుండా చేయి జారి అవి కింద పడుతూ ఉంటాయి. కొందరు అయితే వాటిని తీసుకుని తింటారు. మరికొందరు పోతేపోనీ అంటూ విడిచిపెడతారు. అసలు నేలపై పడిన ఆహారం తినొచ్చా.. తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార పదార్థాలకు సూక్ష్మజీవులు చుట్టుముడతాయి.. సాధారణంగా అయితే మన ఇంట్లో నేల పరిశుభ్రంగా ఉంటుంది. దానిపై ఏదైనా పడితే సెకన్ల వ్యవధిలో దాన్ని తీసుకుని తినవచ్చు. ఐదు సెకన్లలోపు ఆహారం నేలపై ఉన్నా దాని మీద సూక్ష్మజీవులు చేరవని నిపుణులు అంటున్నారు. అయితే ద్రవపు పదార్థాలకు మాత్రం ఈ షరతు వర్తించదని అంటున్నారు. అందుకే వాటిని వదిలేయడం మంచిది. ఇక బయటి వాతావరణంలో మాత్రం సూక్ష్మజీవులు ఎక్కువశాతం ఉంటాయి. భూమి కూడా చాలా కలుషితంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో నేలపై ఏదైనా ఆహార పదార్థం పడితే అప్పటికప్పుడే దానిపై సూక్ష్మజీవులు చుట్టుముడతాయి. కేవలం ఒక సెకన్ వ్యవధిలోనే ఆ ఆహారపదార్థాలు కలుషితం అవుతాయి. అందుకే బయట కిందపడిన ఆహారాన్ని అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఇంట్లో అయితే తరచూ నేలను శుభ్రం చేస్తుంటాం కాబట్టి నిర్మోహమాటంగా సెకన్లలోపు కింద పడిన దాన్ని తీసుకుని తినవచ్చని చెబుతున్నారు. ఒక్కోసారి ఇంట్లో కింద పడిన ఆహారపదార్థాలను కూడా ఒకసారి చూసుకుని తింటే మంచిది. అయితే అన్ని సమయాల్లో ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో కూడా నేల శుభ్రంగా లేకపోతే దానిపై పడిన ఆహారాలను తినొద్దని అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఇది కూడా చదవండి: ఈ సింపుల్ ట్రిక్స్‌తో డార్క్ సర్కిల్స్‌ను ఈజీగా తొలగించుకోవచ్చు! WATCH: #health-tips #life-style మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి