Eating Bread : నిజంగా రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా?

ఈరోజుల్లో బరువు తగ్గాలనుకునే వారిలో ఎక్కువ మంది అన్నానికి బదులుగా రోటీ తింటున్నారు. అయితే.. నిజంగా రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? అన్నం తింటే బరువు పెరుగుతారా? నిపుణులు ఏం చెబుతున్నారు?

New Update
Eating Bread : నిజంగా రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా?

Bread : బియ్యం(Rice), రోటీ(Roti) ఈ రెండింటి పోషక విలువల్లో చాలా తేడా ఉంది. బరువు తగ్గాలనేవారు(Weight Loss) రెండూ తినాలని సూచిస్తున్నారు. అయితే.. వారానికి 4 రోజులు రోటీ తింటే.. 2 రోజులు అన్నం తినాలి. ఈ విధంగా మీరు మీ డైట్​లో వెరైటీని కొనసాగించి వెయిట్ లాస్ అవ్వొచ్చని సూచిస్తున్నారు. అయితే.. గుర్తంచుకోవాల్సిన విషయం ఏమంటే.. బరువు తగ్గడం కోసం ఎప్పుడూ ఆకలితో ఉండకూడదట. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుందంటున్నారు.చపాతీలో గ్లూటెన్ ఉంటే.. బియ్యంలో ఉండదు. కొందరికి గ్లూటెన్ ఇష్టముండదు. అలాంటి వారు తక్కువ మొత్తంలో రోటీలు, ఎక్కువ అన్నం తీసుకోవడం బెటర్. అయితే.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అన్నం కంటే రోటీ ఎక్కువ మేలు చేస్తుందని అంటున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు అన్నం తినకపోవడం ఉత్తమం.

జొన్నలు, రాగులు, మిల్లెట్‌(Millets) లతో చేసిన రోటీలు బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయి వేగంగా పెరగదు. జొన్నలు, రాగులు, బజ్రాలతో చేసిన రోటీలు చాలా పోషకమైనవి. కాబట్టి ఇవి బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. ఒకవేళ మీరు రైస్ తింటూ బరువు తగ్గాలనుకుంటే.. బ్రౌన్ రైస్ మంచి ఎంపికగా చెబుతున్నారు నిపుణులు. వైట్ రైస్​ కన్నా బ్రౌన్ రైస్ మంచి ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు.

Also Read : రాత్రిపూట పరోటా తింటున్నారా..అయితే మీ పని అవుటే..

బరువు తగ్గడానికి 10 ముఖ్యమైన చిట్కాలు :

  • మీ డైట్​లో ఫైబర్ తీసుకోవడం పెంచాలి. రోజువారీ 40 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి.
  • పుష్కలంగా నీరు తాగాలి. దాదాపు ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి.
  • మీ ఆహారంలో ఉప్పు, చక్కెర పరిమాణాన్ని తగ్గించాలి.
  • రిఫైన్డ్​, ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్​కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
  • వంటల కోసం సీడ్స్ ఆయిల్ ఉపయోగించేలా చూసుకోవాలి.
  • రోజూ శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి.
  • అలాగే డైలీ సరైన మార్గంలో వ్యాయామం చేస్తూ కండరాలలో శక్తిని పెంచుకోవాలి.
  • మీ జీవనశైలిలో బరువు తగ్గడానికి అవసరమైన కొన్ని మార్పులు చేసుకోండి.
  • ఆహారం, కూల్​డ్రింక్స్​ కంట్రోల్​లో ఉండేలా చూసుకోవాలి.
  • ఇక చివరగా వెయిట్ లాస్​కు మీరు పాటించాల్సిన మరో చిట్కా.. ధూమపానం, మద్యపానాన్ని మానుకోవాలి.
  • ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే త్వరలోనే మీ బాడీ వెయిట్​లో మార్పు గమనిస్తారు.
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Liquor scam : లిక్కర్​స్కాంలో మరో కొత్త పేరు..ఎవరంటే?

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని సిట్ విచారిస్తుంది.ఈ విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్​చీఫ్ రాజశేఖర్ విచారిస్తున్నారు. ఈ కేసులో బల్లం సుధీర్‌ అనే పేరు తెరపైకి వచ్చింది.

New Update
Kasireddy Rajasekhar Reddy

Kasireddy Rajasekhar Reddy

 AP Liquor scam : వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కెసిరెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఆయనను సోమవారం సాయంత్రం 6.20 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌ కెసిరెడ్డి రాజేష్‌రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్‌ అధికారులు పట్టుకున్నారు. అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. శంషాబాద్‌ నుంచి రాత్రి 11.10 గంటలకు ఆయన్ను విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఉన్న సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు. 

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల
 
కాగా రాజ్‌ కెసిరెడ్డి.. సిట్‌ జారీ చేసిన నోటీసుల చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ, ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటి విచారణలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఆయనపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అయింది. మరోవైపు రాజ్‌ కెసిరెడ్డి విచారణకు ఏ మాత్రం సహకరించకపోవటంతో.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, బినామీలు, మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సిట్‌ అధికారులు ఇటీవల వరుసగా 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన తండ్రి ఉపేంద్రరెడ్డికి నోటీసులిచ్చారు. ఇలా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేయడంతో తప్పించుకోవటం సాధ్యం కాదని గుర్తించిన రాజ్‌ కెసిరెడ్డి.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవాలని కుట్ర చేశారు.  కానీ ఈ లోపు సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

ఎవరీ బల్లం సుధీర్‌ ?

కాగా కసిరెడ్డి విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.  నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్​చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు. ఈవిచారణలో సిట్ చీఫ్‌తో పాటు ఏడుగురు అధికారుల బృందం ఉంది. అయితే వసూళ్ల నెట్‌వర్క్‌తో తనకు సంబంధం లేదని కసిరెడ్డి చెబుతున్నట్లు సమాచారం. గతంలో విజయసాయి, మిథున్ సిట్​ఎదుట ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. పలు ఆధారాలను చూపిస్తూ సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి బల్లం సుధీర్‌ అనే పేరు వచ్చింది. ఇతను కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. లావాదేవీలన్నీ సుధీర్ ద్వారానే జరిపినట్టు తెలుస్తుంది. ఇంతకు సుధీర్ ఎవరు అనే కోణంలో అధికారులు కూపీ లాగే పనిలో ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఇసుక మాఫియాలోనూ ఇద్దరూ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. కసిరెడ్డి, సుధీర్​ కలిసి వందల కోట్ల రూపాయలు వెనుకేసుకొన్నట్లు సమాచారం. ఈ లిక్కర్​ స్కాంలో కేసిరెడ్డి తర్వాత సుధీర్​దే కీలకపాత్ర​అని అంటున్నారు. సుధీర్‌ అరెస్ట్‌ అయితే మరిన్ని సంచలనలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Ap Tenth Results:రేపే ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌!

Also Read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..

 

Advertisment
Advertisment
Advertisment