Interesting Facts : ఆయోధ్యాపురిలో శ్రీరాముడి ఆలయ నమూనాను ఎవరు డిజైన్ చేశారో తెలుసా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..!! శ్రీరాముడి మందిర నిర్మాణానికి దశాబ్దాల ముందే రంగం సిద్ధమైంది. కరసేవకపురంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. సివి సోంపురా తర్వాత విజయ్ దూది రామమందిర డిజైన్ ను రూపొందించారు. 1989 ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో సాధువులు ఈ నమూనాను ఆమోదించారు. By Bhoomi 20 Dec 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే అయోధ్యలో రామమందిర వివాదం రగులుకుంది. దశాబ్దాల తర్వాత ఇప్పుడ రామమందిర నిర్మాణం పూర్తవుతుంది. ప్రారంభ పవిత్రోత్సవం జనవరి 22 , 2024న జరగునుంది. నిర్మాణ సమయంలో అయోధ్యాపూరికి వెళ్లినవారికి కరసేవకపురంలో ఒక భవనంలో శ్రీరామ జన్మభూమి ఆలయ చూసి ఉంటారు. సోషల్ మీడియాలోనూ ఈ ఆలయ నిర్మాణం గురించి చాలా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రారంభానికి సిద్ధంగా ఈ శ్రీరామరామమందిర ఆలయ నమూనాను ఎవరు తయారు చేశారు? ఎలా తయారు చేశారు..? ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలసుకుందాం. 1989లో శ్రీరామ మందిరానికి ఆమోదం: వీహెచ్ పీ ప్రావిన్షియల్ మీడియా ఇంచార్జీ శరద్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం...1989లో ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో సాధువులు ఈ రామమందిర నమూనాను ఆమోదించినట్లు తెలిపారు. అనంతరం ఈ నమూనా ప్రతి హిందువు ఇంట్లో పూజలందుకుంది. ఈ నమూనా ఆధారంగానే శ్రీరామ మందిర నిర్మాణాన్ని చేపట్టారు. అయితే 2020లో శంకుస్థాపన అనంతరం...ఆలయ నమూనాను మూడు అంతస్తులుగా మార్చినట్లు శరద్ శర్మ తెలిపారు. అంతముందు ఇది రెండు అంతస్తులు మాత్రమే ఉండేదట. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మొదటి అంతస్తు, రెండవ అంతస్తుతోపాటు మూడవ అంతస్తు కూడా ఉంది. ఈ మందిరం పొడవు, వెడల్పు కూడా బాగా పెరిగింది. అంతకుముందు 128 అడుగుల పొడవు, 155అడగుల వెడల్పుతో ఉండేది. కానీ ఇప్పుడు 350 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు 161 అడుగుల ఎత్తుకు అయ్యింది. మోడాల్ భాగాలు మాత్రం అలాగే ఉన్నాయి. సింహం, నాట్య మండపం, పవిత్ర గర్భగుడి, కీర్తన మండపం, సత్సంగ మండపం కూడా అందులో నిర్మించారు. ఇప్పుడు ఈ మోడల్ విస్త్రుతంగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. అసలు ఈ నమూనాను తయారు చేసింది ఎవరు? మొదట సివి సోంపురా తర్వాత విజయ్ దూది రామమందిర డిజైన్ ను రూపొందించారు. గుజరాత్ రాష్ట్ర నివాసి అయిన సి.విసోంపురా ఈ ఆలయ అసలు నమూనాను డిజైన్ చేశారు. సి.వి.సోంపురా పూర్వీకులు సోమనాథ్ ఆలయాన్ని నిర్మించారట. ఈ మోడల్ ను చెక్కతో తయారు చేసి వర్క్ షాపులో ఉంచారట. జైపూర్ నివాసి విజయ్ దూదికి తాజ్ మహాల్ తోపాటు ఇతర కళాఖండాలను తయారు చేసినట్లే ఎవరైనా రామమందిర నమూనాను ఎందుకు తయారు చేయకూదనే ఆలోచన రావడంతో 2000 సంవత్సరంలో ఆలయ నమూనాను తయారు చేశాడు. ఆలయంలో ఎలా ఉండాలో చక్కగా రూపొందించాడు. ఈ నమూనాలో ప్రతి స్తంభంలోనూ దేవతామూర్తుల చిత్రాలను చెక్కారు. ఈ మోడల్ తయారీలో థర్మాకోల్, మార్బుల్ ను ఉపయోగించారు. 2002 నుంచి కరసేవకపురంలోకి: ఇక మోడల్ లోపలి భాగం 51000చిన్న చిన్న బల్బులను ఉపయోగించి చెక్కారు. విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి గిరిరాజ్ కిషోర్ జైపూర్ కు వెళ్లినప్పుడు ఆ డిజైన్ ను చూసి ప్రయాగ్ రాజ్ తీసుకువచ్చారట. ఈ ఆలయ నమూనాను 2001లో ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాల ఉంచడంతో...అక్కడ రామమందిర నమూనాను చూసేందుకు విపరీతంగా జనం తరలివచ్చారు. కుంభమేళ ముగిసిన అనంతరం 2002లో కరసేవకపురంలో ఓ భవనానికి ఈ నమూనాను తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ ఆలయ నమూనా అక్కడే ఉంది. దాని ప్రకారమే శ్రీరాముని ఆలయాన్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు. శ్రీరాముని ఆలయ నమూనాను బాబా హజారీ దాస్ నిర్వహిస్తున్నారు. భక్తులకు శ్రీరామ మందిర నమూనా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 1990లో అయోధ్యకు వచ్చారు హజారీ దాస్. తర్వాత అక్కడే ఉండిపోయారు. షాజహాన్ పూర్ నివాసి హజరీ బాబ్రీ కూల్చివేత నుంచి ఆలయ నిర్మాణం వరకు ప్రతిదీ చూశారట. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో గొడవకు దిగారట. గాయాలతో కొన్నిరోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అప్పటి నుంచి కొన్నేళ్లుగా భక్తులకు శ్రీరామ మందిర నమూనాను చూసేందకు అవకాశం కల్పిస్తున్నారు. ఇది కూడా చదవండి : మార్నింగ్ వాక్ లో ఈ పొరపాట్లు చేస్తున్నారా? భారీ మూల్యం చెల్లించాల్సిందే..!! #narendra-modi #babri-masjid #ayodhya-ram-temple #ayodhya-ram-mandir-event #ayodhya-ram-temple-inauguration #ayodhya-ram-temple-opening-date #ayodhya-ram-temple-specialities #ram-temple #interesting-facts #ram-temple-trust #temple-trust #lal-krishna-advani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి