Astor Oil: ఆముదం నూనెను ఇలా వాడితే హెల్త్‌కి ఎన్నో ప్రయోజనాలని తెలుసా..? మనకు ఆరోగ్య సమస్యలను తగ్గించే సామర్థ్యం ఉన్న వాటిలో ఆముదం నూనె ఒకటి. చర్మ, జుట్టు సమస్యలు, నొప్పులు, దురద, గుండె జబ్బులు, మలబద్దకం, విష జ్వరాలు లాంటి సమస్యలను దూరం చేయడంలో ఆముదం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 23 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Castor Oil health benefits: ఆముదం నూనె మనందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి మనం పెద్దలు దీనిని ఉపయోగిస్తూ వచ్చారు. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించే సామర్య్థం ఉన్న వాటిలో ఆముదంనూనె ఒకటి. ఆముదం చెట్టు గింజల నుంచి తీసే ఈ ఆముదం నూనెలో ఎన్నో ఔషధ గుణాలతోపాటు ఆరోగ్య ప్రయోజనాలలు, పోషకాలు ఉన్నాయి. ఆముదం నూనె అని ఆశ్చర్యపోతున్నారా..? మందులతో తగ్గని అనారోగ్య సమస్యలను మన సహజంగా లభించే ఆముదం నూనెను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఆముదం నూనెలో విటమిన్స్, మినరల్స్,ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, రిసినోలియెక్ ఆమ్లం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆముదం నూనె వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నొప్పులను తగ్గించటంతో ఆముదం నూనె మంచి మెడిసిన్ ఆముదం నూనెను వాడడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మనకు వచ్చే వాపు, చర్మ, జుట్టు సమస్యలు, నొప్పులు, దురద, గుండె జబ్బులు, మలబద్దకం, నులిపురుగులు, విష జ్వరాలు వంటి అనారోగ్య సమస్యలకు ఆముదం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆముదాన్ని వాడడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుచుతుంది, ఇన్ ప్లామేషన్‌ను తగ్గించి నొప్పులను తగ్గించటంతో ఆముదం నూనె మంచి మెడిసిన్. ఆహారంలో భాగంగా ఆముదాన్ని తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, నులిపురుగులు వంటి సమస్యలు నుంచి ఉపశమనం లభించి పొట్ట శుభ్రపడుతోంది. ఆముదంలో అన్ డీసైక్లీనిక్ యాసిడ్ చర్మ సమస్యలను తగ్గించి తామర, దురద వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఆముదం నూనెను కొబ్బరి నూనెను సమానంగా వేసి కలిపి చర్మసమస్యలు ఉన్న చోట రాస్తే మంచి ఉపశమనం వస్తుంది. ఇది కూడా చదవండి: రాత్రిపూట నీరు ఎక్కువగా తాగుతున్నారు..? అయితే..జాగ్రత్త తీసుకోండి అంతేకాదు ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా ఆముదం కలిపి పరగడుపున తాగాలి. ఇలా తాగితే ఫుడ్ పాయిజన్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా గాయాలను తగ్గించడంలో, ఇన్పెక్షన్ రాకుండా అడ్డుకోవడంలో ఆముదం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. గాయాలు ఉన్న దగ్గర ఆముదం నూనెను రాస్తే గాయాలు త్వరగా మానుతాయి. నడుము నొప్పి ఉంటే ఆముదం నూనెతో 15 నుంచి 20 నిమిషాలు మర్దనా చేసి తరువాత వేడి నీటితో కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరు వెచ్చని నీటిలో ఆముదం కలిపి పరగడుపున తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడి.. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతోంది. ఇలా ఆముదం నూనె మన శరీరారికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని వాడితే ఎన్నో మొండి వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. #health-benefits #home-remedies #tips #castor-oil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి