Health Tips : ప్రతిరోజూ స్కిప్పింగ్ చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

బిజీ లైఫ్ స్టైల్, బద్ధకంతో చాలా మంది వర్కవుట్స్ చేసేందుకు ఆసక్తి చూపించరు. కానీ రోజూ ఏదో ఒక వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. మన ఇంట్లోనే సులభంగా ఎలాంటి హంగామా లేకుండా చేసే వర్కవుట్స్ లో స్కిప్పింగ్ ఒకటి. స్కిప్పింగ్ వల్ల ఫిట్ నెస్ మాత్రమే కాదు...మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు

New Update
Health Tips : ప్రతిరోజూ స్కిప్పింగ్ చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ప్రతిరోజూ వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సలహాఇస్తుంటారు. వర్కవుట్స్ మనం శారీరకంగా , మానసికంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. వర్కవుట్స్ చేస్తే ఫిట్ ఉంటాం, శరీరాక్రుతిని కలిగి ఉండవచ్చు. కానీ బిజీలైఫ్ స్టైల్లో మనకు వ్యాయామానికి సమయమే దొరకడం లేదు. కానీ ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు. అందులో స్కిప్పింగ్ ఒకటి. దీని వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

సులభంగా బరువు తగ్గుతారు:
అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారికి స్కిప్పింగ్ చాలా ఉపయోగంగా ఉంటుంది. రోజూ స్కిప్పింగ్ చేస్తూ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ప్రతిరోజూ ఒక గంటపాటు స్కిప్పింగ్ చేస్తే 13వంద క్యాలరీల బర్న్ అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి స్కిప్పింగ్ మంచి ఫలితం ఇస్తుంది.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది:
స్కిప్పింగ్ మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ ధ్యానం మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: దసరాలోపు వీటిని ఇంటికి తెచ్చుకుంటే…మీరు పట్టిందల్లా బంగారమే..!!

గుండెకు మంచిది:
స్కిప్పింగ్ గుండె ఆరోగ్యానికి మంచిది. రోప్ ప్లే గుండె వేగాన్ని పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తులకు మంచిది:
స్కిప్పింగ్ చేసిన  తరువాత, శ్వాస వేగంగా మారుతుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది:
స్కిప్పింగ్ అంటే భుజాలను తిప్పడం, పాదాలతో ఎగరడం. జంపింగ్ భాగాలను బలంగా, సులభంగా తిప్పేలా చేస్తుంది. ఇది శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. స్కిప్పింగ్ వల్ల శరీరంలోని అవయవాల కదలిక పెరుగుతుంది, జీవక్రియ వేగవంతం అవుతుంది. అవయవాల మధ్య సమన్వయం పెరుగుతుంది. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు, తొడలు బలపడతాయి.

ఒత్తిడిని తగ్గిస్తుంది:
ప్రస్తుతం మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. చాలా మంది ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారు. స్కిప్పింగ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. స్కిప్పింగ్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: చూడు తమ్ముడు.. జట్టు ముఖ్యం.. నీ సెంచరీ కాదు.. ఇది తెలుసుకో..!

Advertisment
Advertisment
తాజా కథనాలు