ఈ ఆహారాలను ఫ్రిడ్జ్ లో నుంచి వేడి చేసుకుని తింటున్నారా? చాలా డేంజర్!!

New Update
ఈ ఆహారాలను ఫ్రిడ్జ్ లో నుంచి వేడి చేసుకుని తింటున్నారా? చాలా డేంజర్!!

సాధారణంగా అయితే మనం వండుకున్నవి ఏమైనా మిగిలిపోయినా.. బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి పాడైపోతాయని ఫ్రిడ్జ్ లలో పెడుతూంటాం. అయితే ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఫ్రిడ్జ్ లలో బాగానే ఉంటున్నాయని.. వారాల తరబడి.. నెలలు తరబడి అలా వదిలేయకూడదు. మనం వండుకున్న ఆహార పదార్థాలైతే.. రెండు రోజులు, అదే కూరగాయలైతే ఓ వారం రోజుల వరకూ కాస్త బాగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆహార పదార్దాలను ఫ్రిడ్జ్ లో పెట్టి, బయటకు తీసి వేడి చేసుకుని తింటుంటారు. కానీ కొన్ని ఆహార పదార్థాలను వేడి చేయడం అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు వెల్లడించారు.

అందులోనూ ప్రస్తుతం వర్షాకాలం.. ఈ సీజన్ అంటేనే అంటు వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎలాగోలా వ్యాధుల బారిన పడుతూనే ఉంటారు. ఇప్పటికే చాలా వరకూ వైరల్ ఫీవర్లు వ్యాపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా.. వీధుల్లో మురుగు పేరుకుపోయి.. దోమల బెడద పెరిగిపోతుంది. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల విజృంభణ ఇప్పుడే మొదలవుతుంది. దీన్ని నివారించాలంటే వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి ఎప్పడికప్పుడు వండుకుని ఫ్రెష్ గా తినడమే బెటర్ కానీ.. ఇలా ఫ్రిడ్జ్ లలో రోజుల తరబడి.. రెండు, మూడు సార్లు వేడి చేసుకున్న ఆహారాన్ని తినకూడదు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. మరి అవేంటో తెలుసుకుందామా.

చికెన్: చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకూ దీనికి ఫ్యాన్స్ ఎక్కువ. సాధారణంగా కోడి మాంసంలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకొని మళ్లీ వేడి చేయడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ విషంగా మారుతుందట. దీని వలన ఆహారం జీర్ణం కాక.. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

అన్నం: వండిన అన్నాన్ని ఒక్కసారి ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు. మళ్లీ తర్వాత రోజు వేడిచేసుకొని తినొచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు, మరిన్ని సార్లు వేడి చేసి తినకూడదు. బయట వాతావరణంలో ఉంచినప్పుడు హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది.

కూరగాయలు: పాలకూర పప్పు, పాలక్‌ పనీర్‌, పాలకూర పచ్చడి వేడి చేసి తినకూడదు. అలాగే పుట్టగొడుగులను ఒక్కసారే వండుకొని తినాలి. వీటిని కూర వండిన తర్వాత పదే పదే వేడి చేసి తినకూడదు. అలాగే తింటే విరోచనాలు అయ్యే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఛీ ఉప్మా అనే తీసిపారేయకు బ్రో.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే డైలీ టిఫిన్ అదే ఇక

ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు. కానీ దీన్ని తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు జీర్ణ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
_upma

Upma

టిఫిన్ ఉప్మా అని చెప్పిన వెంటనే కొందరికి వాంతులు మొదలవుతాయి. కొందరు అయితే టిఫిన్ పూర్తిగా చేయడమే మానేస్తారు. అయితే చాలా మంది ఈ ఉప్మా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలియదు. ఉప్మా వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మరి ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

జీర్ణ సమస్యలు

ఉప్మా తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉప్మాలోని పోషకాలు జీర్ణం సాఫీగా సాగేలా చేస్తుంది. అలాగే కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

మలబద్ధకం

ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. రిచ్ ఫైబర్ లేని ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి ఉప్మా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్మా రవ్వలో ఎక్కువగా పీచు ఉంటుందని ఇది అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

రోగనిరోధక శక్తి

ఉప్మాలో ఎక్కువగా కూరగాయలు వేస్తుంటారు. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధులు అన్ని కూడా తగ్గుతాయని అంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు.

ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment