కొవిడ్ పై రాజకీయం చేయొద్దు.. అప్రమత్తంగా ఉండండి: కేంద్రం కీలక సూచన

కరోన కొత్తవేరియంట్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోగ్యపరమైన అంశాలపై ఎవరకూ రాజకీయం చేయొద్దు. అన్నీ రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి స్థానిక ఆస్పత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు.

New Update
కొవిడ్ పై రాజకీయం చేయొద్దు.. అప్రమత్తంగా ఉండండి: కేంద్రం కీలక సూచన

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోన కొత్తవేరియంట్ వ్యాప్తి చెందుతుండటంపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జేన్ 1 సబ్ వేరియంట్ కారణంగా దేశంలో కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు. బుధవారం అయా రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన.. మూడు నెలలకోసారి తప్పకుండా స్థానిక ఆస్పత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేశారు.

‘ఈ సమయంలో మనం అందరం కలిసి సమష్టిగా పనిచేయాలి. అయితే కొవిడ్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, జాగ్రత్తగా ఉండాలి. ఆసుపత్రుల్లో వసతులు సిద్ధం చేయాలి. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. అలాగే ప్రజలకు దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మహమ్మారిని అంతం చేసేందుకు రెడీగా ఉండండి. ఆస్పత్రిలో ప్రతి మూడు నెలలకోసారి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలపై ఎవరకూ రాజకీయం చేయొద్దు. అన్నీ రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది. అలాగే పండగ సీజన్‌తో పాటు చలి కాలం ఎఫెక్టుతో వైరస్‌ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందిని, వెంటనే దీనిపై నియంత్రణ చర్యలు తీసుకోవాలి' అంటూ అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు.

ఇది కూడా చదవండి : Telangana Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు..పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ఇదిలావుంటే.. జేన్‌.1 వేరియంట్‌పై ఆందోళన అవసరంలేదని లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని, ఇదొక ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు