Vamshi Chand Reddy: ఏంఐఏంలోకి డీకే అరుణ.. వంశీ చంద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అసదుద్దీన్ పిలుస్తే డీకే అరుణ ఎంఐఎంలో కూడా చేరవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి. అవకాశవాద రాజకీయాలకు డీకే అరుణ మారుపేరు అని అన్నారు. కాంగ్రెస్ కు డీకే అరుణ వెన్నుపోటు పొడిచిందని.. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకం అని మండిపడ్డారు. By V.J Reddy 26 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Vamshi Chand Reddy: పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) సమయం దగ్గర పడుతున్న క్రమంలో తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) ఒక్కసారిగా హీటెక్కాయి. మహబూబ్ నగర్ (MBNR) పార్లమెంటు నియోజకవర్గంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్ - బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎఐసిసీ కార్యదర్శి చల్లా బీజేపీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే డీకే అరుణపై (D.K. Aruna) విమర్శల దాడికి దిగారు. ALSO READ: మంత్రి జయరాంకు వైసీపీ షాక్ ..! డీకే అరుణ ఏంఐఏంలోకి.. విలువలు, విధానాలు లేని వ్యక్తి డీకే అరుణ అని అన్నారు మాజీ ఎమ్మెల్యే వంశీ వంశీచంద్ రెడ్డి. అవకాశవాద రాజకీయాలకు డీకే అరుణ మారుపేరు అని అన్నారు. అసదుద్దీన్ పిలిస్తే డీకే అరుణ ఏంఐఏం లోకి వెళ్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే అరుణ కంటే దగాకోరు అరుణ అంటే కరెక్ట్ సెట్ అవుతుందని వ్యాఖ్యానించారు. నువ్వు రా.. డీకేకు సవాల్!.. 2019లో 15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుండి మహబూబ్ నగర్ ఎంపీ గా పోటీ చేస్తానని డీకే అరుణ చెప్పిందని సంచలన ఆరోపణలు చేశారు వంశీ వంశీచంద్. డీకే అరుణ డబ్బులు అడిగినట్టు ప్రమాణం చేయడానికి నేను రెడీ అని అన్నారు. ఏ రామ మందిరానికి రమ్మన్నా నేను వస్తానని తేల్చి చెప్పారు. 28వ తేది 11 గంటలకు మహబూబ్ నగర్ లోని టీచర్స్ కాలనీలోని రామ మందిరానికి వస్తాను.. రాముడి భక్తురాలు నేనా, డీకే అరుణ నా అనేది తెలిపొద్ది అని డీకే అరుణకు సవాల్ విసిరారు. పూటకో పార్టీ.. డీకే అరుణ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అని అన్నారు వంశీ వంశీచంద్. పూటకో పార్టీ మార్చే వ్యక్తి డీకే అరుణ అని పేర్కొన్నారు. డీకే అరుణ పేరు పలకాలి అంటే నాకు సిగ్గుగా ఉందని అన్నారు. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే తాను ఏఐసీసీ మెంబెర్ అని అన్నారు. డీకే అరుణ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిని అని పేర్కొన్నారు. వెన్నుపోటు పొడిచింది... కాంగ్రెస్ పార్టీకి డీకే అరుణ వెన్నుపోటు పొడిచిందని అన్నారు. డీకే అరుణది నాకంటే గొప్ప రాజకీయ చరిత్ర ఏం కాదు అని పేర్కొన్నారు. నేను డబ్బులకి అమ్ముడుపోయే వ్యక్తిని అయితే డీకే అరుణ లాగా బంగ్లాలపై బంగ్లాలు కట్టుకునే వాడిని. డీకే అరుణ మొన్న అన్ని డబ్బులు తీసుకొని గద్వాల లో పోటీ చేయలేదో ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకోను అని అన్నారు. ALSO READ: మళ్లీ ఎన్డీఏ గూటికి చేరనున్న నితీశ్ కుమార్.. ! DO WATCH: #congress #bjp #dk-aruna #vamshi-chand-reddy #parliament-elections #telangana-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి