Diwali Offers: స్మార్ట్‌ ఫోన్ల పై దీపావళి ఆఫర్లు..అదిరిపోయే డిస్కౌంట్లు!

దీపావళి సందర్భంగా ప్రముఖ మొబైల్‌ కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటించాయి. వాటిలో ఐ ఫోన్‌ , షియోమి, రెడ్‌ మీ ఫోన్లు ఉన్నాయి.

New Update
Diwali Offers: స్మార్ట్‌ ఫోన్ల పై దీపావళి ఆఫర్లు..అదిరిపోయే డిస్కౌంట్లు!

పండుగలు వస్తున్నాయంటే అందరూ ఎదురూ చూసేది ఎలక్ట్రానిక్‌ వస్తువుల మీద డిస్కౌంట్ల కోసమే. నిన్నటి వరకు దసరా పండుగ రోజులు గడిచాయి..దాంతో పాటు ఎన్నో ఫోన్లు మీద, బెస్ట్ మొబైల్స్‌ మీద ఆఫర్లు రావడంతో వినియోగదారులు ఎందరో తమకు కావాల్సిన మొబైల్స్ ని తీసుకున్నారు.

ఈ సమయంలోనే దీపావళి మంచి మంచి ఆఫర్లతో వచ్చేసింది. కొత్త ఫోన్‌ కొనాలనుకునే వారు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. ఏఏ కంపెనీలు ఎంతేంత ఆఫర్లు ఇస్తున్నాయో ఇప్పుడు చూద్దాం...

ఐ ఫోన్‌ 15 సిరీస్‌

యాపిల్‌ కంపెనీ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వచ్చేసింది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్స్ తీసుకోవచ్చు. ఐ ఫోన్‌ ప్రో, 15 ప్రో మ్యాక్స్ మోడళ్ల పై రూ. 6 వేలు, ఎస్‌ఈ పై రూ. 2 వేలు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. పాత స్మార్ట్‌ ఫోన్స్‌ పై రూ. 67,800 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా పొందవచ్చు.

ఒప్పో స్మార్ట్‌ ఫోన్స్‌

ఫోల్డబుల్‌ ఫోన్‌ ఒప్పో ఫైండ్‌ ఎన్‌ 3 ప్లిప్‌ ఇప్పుడు 94 , 999 కే అందుబాటులో ఉంది. దీపావళికి రూ. రూ.12 వేల వరకు క్యాష్‌ బ్యాక్‌ రూ. 8 వేల ఎక్స్చేంజ్‌ బోనస్‌ తో కంపెనీ దీన్ని అందిస్తుంది. ఒప్పో రెనో 10ప్రో+ 5G, ఒప్పో రెనో10 ప్రో, ఒప్పో రెనో 10, ఒప్పో A79 5G వంటి ఇతర మోడల్స్ అతి తక్కువ ధరకు లభిస్తున్నాయి.

షియోమీ, రెడ్‌మీ

ఎంపిక చేసిన మోడల్స్ పై 50 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నాయి. రెడ్ మీ నోట్‌ 12 ప్రో 5జీ ఫోన్‌ ఈ దీపావళి ఆఫర్లో రూ. 17,999 డిస్కౌంట్ ధరతో లభిస్తుంది. దీనిపై రూ. 3,000 ఎక్స్ఛేంజ్ కూడా పొందవచ్చు. రెడ్‌మీ ఏ2 ను రూ.5,299 ధరకే సొంతం చేసుకోవచ్చు.

వివో స్మార్ట్‌ఫోన్స్..

వివో ఎక్స్ 90 సిరీస్‌పై రూ10,000, వివో వీ29 సిరీస్‌పై రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. పాత వివో ఫోన్లపై రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను సొంతం చేసుకోవచ్చు. కొన్ని ఎంపిక చేసిన కార్డుల పై ఈ ఆఫర్లను పొందవచ్చు.

వన్‌ప్లస్ మోడల్స్..

నార్డ్ 3 5Gపై రూ. 3,000, నార్డ్ సీఈ3 5Gపై రూ. 2,000 డిస్కౌంట్స్‌తో సొంతం చేసుకోవచ్చు. ఇక, వన్‌ప్లస్ 11R 5G, వన్‌ప్లస్ 11R 5G సోలార్ రెడ్ వంటి మోడల్స్ కూడా రూ. 2,000 డిస్కౌంట్ తర్వాత తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

New Update
Muthoot finance Shares

Muthoot finance Shares Photograph: (Muthoot finance Shares)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో గోల్డ్ లోన్ కంపెనీలపై భారీ ఎఫెక్ట్ పడింది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు అయితే దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఆర్బీఐ కీలక ప్రకటన చేసిన తర్వాత..

బంగారు ఆభరణాలపై బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీ వంటి నియంత్రిత సంస్థలు గోల్డ్ లోన్లు ఇస్తాయని గవర్నర్ తెలిపారు. అయితే వ్యక్తిగత సంస్థల రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలను జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ప్రభావం పడింది.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

ముత్తూట్ ఫైనాన్స్ కోసం బంగారు రుణాలు కంపెనీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో 98 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో మణప్పురం ఫైనాన్స్‌లో 50 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 21 శాతం ఏయూఎం గోల్డ్ లోన్స్ నుండి వస్తాయి. ఈ షేర్లు ధరలు 10 శాతం క్షీణించి రూ.2,063 వద్ద ముగిసింది. అదేసమయంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు ధర 6.66 శాతం క్షీణించి రూ.311.25 వద్ద ముగిసింది. 

Advertisment
Advertisment
Advertisment