Vyuham Movie: సీఎం జగన్ తో RGV భేటీ

ఈ రోజు సీఎం జగన్ తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఇటీవల ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ వ్యూహం సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ తో ఆర్జీవీ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

New Update
Vyuham Movie: సీఎం జగన్ తో RGV భేటీ

RGV Meets CM Jagan: ఈ రోజు సీఎం జగన్ తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఇటీవల ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ వ్యూహం సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా విడుదల ఆపాలంటూ టీడీపీ నేత లోకేష్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా విడుదల ఆపాలని వ్యూహం సినిమా టీం కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో ఆర్జీవీ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ALSO READ: చంద్రబాబు కేసు విచారణ… చివరిలో ఊహించని ట్విస్ట్!

వ్యూహానికి బ్రేక్..

దర్శకుడు రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చింది సివిల్ కోర్ట్. ఆర్జీవీ తీసిన 'వ్యూహం' సినిమాను ఓటీటీ, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహం సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సినిమా విడుదలపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

వ్యూహం సినిమాపై తీర్పు రిజర్వ్

వ్యూహం సినిమాపై వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. ఒకవేళ ఏపీలో ఎన్నికల పై ప్రభావం ఉంటుందనుకుంటే, తెలంగాణలో అయినా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు RGV అడ్వకేట్. తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవ్ కాబట్టి ఇక్కడ సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలని వాదనలు వినిపించారు. అయితే, RGV అడ్వకేట్ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు నారా లోకేష్ తరుఫున న్యాయవాది.

సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలి..

వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాపై టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని ఆయన కోరారు. రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారని ఆరోపించారు.

జగన్ లబ్ధి కోసమే..

దర్శక, నిర్మాతల చర్యలతో చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని, వ్యూహం సినిమాతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. ఇప్పటికే దర్శక నిర్మాతలు పలు తప్పుడు చిత్రాలు విడుదల చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు లోకేష్. తీసిన సినిమాలకు లాభాలు రాకపోయినా మళ్లీ సినిమా తీస్తున్నారని ఆరోపించారు. నష్టాలు వస్తాయని తెలిసినా జగన్ లబ్ధి కోసమే చిత్రం తీశారన్నారు. ఏపీ సీఎం జగన్ వెనుక ఉండి వ్యహం సినిమా తీయించారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.

Advertisment
Advertisment
తాజా కథనాలు