Hyderabad : భారతీయులు చక్కెర, నూనె, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలి- ఎన్‌ఐఎన్

భారతీయులు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తోంది భైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. చక్కెర, నూనెలు, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలని చెప్పింది.

New Update
Hyderabad : భారతీయులు చక్కెర, నూనె, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలి- ఎన్‌ఐఎన్

NIN Diet Mantra For Indians :  13 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌(Hyderabad) కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(National Institute Of Nutrition) భారతీయుల ఆహార జీవన శైలి(Life Style) మీద కొత్త పరిశోధనలను వెలువరించింది. భారతీయుల(Indians) కోసం ఆహార మార్గదర్శకాలను సూచించింది. భారతీయులు ఆరోగ్యంగా ఉండాలంటే..సుగర్ కటెంట్‌ను బాగా తగ్గించాలని చెబుతోంది. రోజుకు 20-25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తీసుకోకూడదని సూచించింది. మనం తినే ఆహారంలో చక్కెర సహజ కార్బోహైడ్రేట్‌ల నుంచి వస్తుందని తెలిపింది.అలాగే నూనెలను వాడడం, నూనె పదార్ధాలను తినడం కూడా మానేయడం బెటర్ అని చెప్పింది ఎన్ఐఎన్. సముద్రపు ఆహారం ద్వారా అవసరమైన కొవ్వు, ఆమ్లాలు తీసుకోవచ్చని చెప్పింది. దాంతో పాటూ ప్రొటీన్ కోసం వాడే సప్లిమెంట్లను కూడా అవాయిడ్ చేస్తే మంచిదని సూచించింది.

వీటిల్లో వంట ఉత్తమం..

ఇక వంట వండుకునే పాత్రల గురించి కూడా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్నింటి కంటే మట్టి పాత్రల్లో వంట వండుకోవడం మంచి పద్ధతి అంటోంది ఎన్‌ఐఎన్. వీటి వల్ల తక్కువ నూనె అవ్వడమే కాదు న్యూట్రిషియన్స్ కూడా అందుతాయని చెబుతోంది. ఇక ఐరన్ వంటి మెటల్ గిన్నెల్లో సాంబార్ లాంటి పదార్ధాలను ఉంచకపోవడమే మేలని చెబుతోంది. స్టీల్ కూడా వంటకు మంచిదేనని..నాన్ ప్టిక్, గ్రానైట్ స్టోన్ వంట పాత్రలకు ఎంత దూరం అంటే అంత ఆరోగ్యమని తెలిపింది.

ఇండియన్ పిల్లలు అధికంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అదే సమయంలో మరికొందరు అధిక బరువు, ఊబకాయంతో అవస్థలు పడుతున్నారు. దీనంతటికీ కారణం సరైన ఫుడ్ తీసుకోకపోవడమే అంటోంది ఎన్ఐఎన్. మన శరీర బరువు కంటే రోజూ 1. 6 కేజీ మాత్రమే బరువు తీసుకోవాలని చెప్పారు మార్గదర్శకాలను రూపొందించిన కమిటీ చైర్‌పర్సన్ NIN డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆర్ అన్నారు.

Also Read:Andhra Pradesh: గోనె ప్రకాష్ రావు సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు