కేసీఆర్.! ఆ విషయం మర్చిపోయారా..? ప్రశ్నించిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు. By Karthik 29 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి వరద ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ ఎంపీ, కాంగ్రాస్ ప్రచార కమిటి కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ముంపునకు గురైన బొక్కల గడ్డ (Bokkala gadda) ప్రాంతంలో పర్యటించిన ఆయన.. ఇంటింటికీ తిరుగుతూ వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్నేరు (Munneru) వాగు సైతం ఏ సంవత్సరం లేని విధంగా ఉధృతంగా ఉందని వరద మరోసారి పెరిగినా అశ్చర్యపోనవసరం లేదన్నారు. ముంపు ప్రాంత వాసులు బయట తిరుగొద్దని, పదునుగా ఉన్న విద్యుత్ స్థంభాలను ముట్టుకోవద్దని, వరద ఉధృతి ఉన్న ప్రాంతాలవైపు వెళ్లొద్దని సూచించారు. Your browser does not support the video tag. గత సంవత్సరం భద్రాచలంలో భారీగా వరదలు వచ్చాయని, ఆ సమయంలో సీఎం కేసీఆర్ (kcr) పర్యటించి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ మాట ఇచ్చి సంవత్సరం దాటినా రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదని ఆరోపించారు. కేసీఆర్ (kcr) ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే ఉండిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం మున్నేరు ప్రాంతంలో పర్యటించిన ఓ వ్యక్తి కరకట్ట ఎలా నిర్మిస్తారు మట్టిగడ్డలతోనా అని వెటకారం చేశారని పొంగులేటి గుర్తు చేశారు. Your browser does not support the video tag. ఆ నాయకుడు ఏనాడైనా నిర్మాణాలు చేపడితే కరకట్ట గురించి తెలిసేదని మాజీ ఎంపీ ఎద్దేవా చేశారు. చిన్నవర్షం కురిసినా మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోందన్నారు. ఇంత వరకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) వరద బాధితులను పరామర్శించి పాపాన పోలేదన్నారు. ఎన్టీఆర్ (ntr) విగ్రహం ఏర్పాటు చేయడంలో ఉన్నశ్రద్ధ వరద ప్రభావిత ప్రాంత వాసులను రక్షించడంలో లేదని విమర్శించారు. పువ్వాడకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని పొంగులేటి జోస్యం చెప్పారు. 2014లో బీఆర్‌ఎస్ (brs) అధికారంలోకి రాగానే అనేక పనులు చేస్తామని గొప్పలు చెప్పారని, రైతుల కోసం మంచి పాలన అందిస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ (kcr) మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. ఇళ్లు వరదల్లో మునిగిపోయి నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం 25 వేల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల మృతి చెందిన వారి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. మరో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. #brs #kcr #congress #victims #ponguleti-srinivas-reddy #flood #essentials మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి