Dalit Bandhu: దళిత బంధు నిధులు ఫ్రీజ్..! లబ్ధిదారుల్లో టెన్షన్.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు వేసింది. అయితే ఇప్పుడు ఆ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నిధులను కాంగ్రెస్ సర్కార్ ఫ్రీజ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. By B Aravind 13 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో దళిత బంధు అమలుపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఆ పథకానికి ఎంపికై నిధులొచ్చిన వారిలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం లభించింది. మొత్తం 11,108 మందికి గులాబి పార్టీ దళిత బంధు సాయం చేసింది. ఇందుకోసం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు వేసింది. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన నిధుల్ని ఉపసంహరించుకునే పరిస్థితి లేదు. Also Read: పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. సాధువులను చితకబాదిన స్థానికులు.. అంతేకాదు రెండో దఫాలో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున మొత్తం లక్షా 31 వేల మందిని గుర్తించారు. ఇందుకోసం వీరికి రూ.749 కోట్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ పథకంపై అర్హులకు సాయంపైనా క్లారిటీ లేదు. అయితే ఇప్పటి వరకు లబ్ధిదారులకు వచ్చిన రూ.436 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తుందా.. ఇక దళిత బంధు లేనట్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read: నగరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్..విదేశీయుల సందడి #brs #telangana-news #congress #dalita-bandu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి