Srinidhi Shetty కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ప్రస్తుతం నాని హిట్ 3 మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి నితీష్ తివారీ బాలీవుడ్ 'రామాయణం' గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రామాయణంలో సీత పాత్రలో నటించేందుకు ముందుగా తనకు ఆఫర్ వచ్చినట్లు తెలిపారు. అయితే ఇందులో హీరో యష్ రావణాసురిడి పాత్రలో నటిస్తున్నారని తెలిసి.. చేయనని చెప్పినట్లు చెప్పింది. యష్- శ్రీనిధి 'కేజీఎఫ్' సినిమాలో జంటగా నటించారు. ప్రస్తుతం 'రామాయణం' లో రాముడి పాత్రలో రన్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. అన్నీ కుదిరితే శ్రీనిధి సీతగా కనిపించెదనమాట.
నాని జోడీగా
ఇదిలా ఉంటే 'హిట్ 3' లో శ్రీనిధి నాని జోడీగా కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, మూవీ సాంగ్స్ లో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధికి 'హిట్ 3' మరో బ్లాక్ బస్టర్ కాబోతుందని అనుకుంటున్నారు. 'హిట్ 3' మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో నాని రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. నాని సొంత ప్రొడక్షన్ వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
హిట్ 2, హిట్ 2 సూపర్ సక్సెస్ కావడంతో హిట్ 3 పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లే సినిమా కూడా ఉండబోతుందని పలు ఇంటర్వ్యూస్ లో కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు నాని. అంతేకాదు ఈ సినిమా బాగోకపోతే తన నెక్స్ట్ మూవీ 'ప్యారడైస్' చూడొద్దు అని కూడా చెప్పారట. దీంతో సినిమా ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు. దసరా,హయ్ నాన్న, కోర్టు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న నాని.. ఈ సినిమాతో కూడా సక్సెస్ వస్తుందని భావిస్తున్నారు. మరి సినిమా అనుకున్నట్లుగా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే.
latest-news | cinema-news | Srinidhi Shetty HIT- 3 | ramayanam-movie | kgf-hero-yash