Makara Jyothi: నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పోటెత్తిన అయ్యప్ప స్వామి భక్తులు

శబరిమలలో ఈరోజు(సోమవారం) మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి దర్శనమిచ్చే మకర జ్యోతిని వీక్షేంచేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తారు.

New Update
Makara Jyothi: నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పోటెత్తిన అయ్యప్ప స్వామి భక్తులు

కేరళలోని శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వాములు అక్కడికి భారీగా తరలివస్తున్నారు. స్వామి శరణం.. అయ్యప్ప శరణంం నామ స్మరణలతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. మకరజ్యోతిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు 50 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని ట్రావెన్‌కోర్ బోర్టు ప్రకటించింది. కానీ వాస్తవానికి 4 నుంచి 5 లక్షల మంది వరకు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం ఉండొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.

Also read: స్టాఫ్‌నర్సుల భర్తీ ప్రక్రియ తుదిదశకు.. రెండు మూడు రోజుల్లో అభ్యర్థులు ఖరారు..

శివుని తనయుడు అయ్యప్ప స్వామి కొలువుదీరిన క్షేత్రం శబరిమల. శబరిలో ప్రతి మకర సంక్రాంతి రోజున.. శబరిలో మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వామలు శబరికి వెళ్తుంటారు. మకర జ్యోతిని దర్శించుకున్నాకే తమ వీక్షను విరమిస్తారు. 41 రోజుల పాటు దీక్ష చేసిన స్వాములు మకర జ్యోతి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఈ జ్యోతి దర్శనం ఉంటుందని.. ఆలయ బోర్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేసింది.

Also Read: రామ భక్తులకు గుడ్ న్యూస్…ఈ దక్షిణాది నగరాల నుంచి అయోధ్యకు విమానాలు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

పాకిస్తాన్ కు భారత్ షాక్ ఇచ్చింది. 64 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగి సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వలన పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.

New Update
india

Indus River

కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణం అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి.  పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ...ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది. 

పహల్గామ్ దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది.  ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని వచ్చేశారు. ఈరోజు ఉదయం నుంచీ రక్షణశాఖ, క్యాబినెట్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వీటి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  పాక్ పౌరులు, పర్యటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది.  పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరు. ప్రస్తుతం భారత్ లో ఉ్న వారు కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలి . 

సింధూ జలాల ఒప్పందం...

సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ చాలా సార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంక ఉపేక్షించేదే లేదంటూ సింధు జాలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిపి ఒకచోట ప్రవహించలేదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సిధుజలాల జోలికి వెళ్ళలేదు. తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటూ 64 ఏళ్ళ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్. 

ఎడారిగా మారనున్న పాక్..

ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు.  ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధూ జలాలపైనే ఆధారపడి ఉంటుంది.  అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుంది.    

ఏమిటీ ఒప్పందం..?

సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.  దీని ప్రకారం భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లపై, పాకిస్తాన్‌కి పడమర నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. సింధూ నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది. అందువల్లనే ఈ నదిపై రెండు దేశాల ఒప్పందం చేసుకున్నాయి.  ఈ ఒప్పందం వల్ల సింధూ జలాల్లో  80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది. ఇంతకు ముదు కడా చాలా సార్లు ఈ షింధూ జలాల ఒప్పందం వివాదాస్పదం అయింది. దీని వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్‌కి తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధూ జలాలను కట్ చేసి పారేసింది. 

today-latest-news-in-telugu | pakistan | sindhu | river

Also Read: BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!

Advertisment
Advertisment
Advertisment