/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-75.jpg)
Devara Third Single : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)- కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు పాటలు యూట్యూబ్ ను షేక్ చేయగా.. మేకర్స్ తాజాగా థర్డ్ సింగిల్ వదిలారు. 'దావూది' (Daavudi) అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ పాటలో తారక్, జాన్వీకపూర్ పోటీపడి మరీ డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కంప్లీట్ డ్యాన్స్ విత్ గ్రేస్ కనిపించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సాంగ్ తో పండగ చేసుకుంటున్నారు.
When this duo gets going 😎
you can't stay calm nothing but whistling while watching the hysteria ❤️🔥Here’s the #Daavudi Video Song to keep you on track for the Blast on the Big Screens 🔥
▶️ https://t.co/9L2lehNT06
An @anirudhofficial musical 🎶✍️ - @Ramjowrites,… pic.twitter.com/Kn9c8bh6Wv
— NTR Arts (@NTRArtsOfficial) September 4, 2024
Also Read : వరద బాధితులకు రామ్ చరణ్ భారీ విరాళం..
శేఖర్ మాస్టర్ కొరియోగ్రపీ అందించిన ఈ పాటలో కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ పాటను నకాష్ అజీజ్, అకాసా ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.