కర్నాటకలో కాంగ్రెస్ పని ఖతం? సింగపూర్ లో కుట్ర జరిగిందన్న డిప్యూటీ సీఎం..!! కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందా? అవును ఇప్పుడు కర్నాటకలో ఇదే హాట్ టాపిక్. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ ఆరోపణలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. By Bhoomi 25 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై కొన్ని నెలలు కూడా గడవకముందే ప్రభుత్వం పతనం అవుతుందన్న చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా వెల్లడించడంతో ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘బయట’ కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత, భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన కొందరు నాయకులు ఇతర పార్టీల నాయకులతో ఒప్పందాలు చేసుకుంటున్నారని డికె శివకుమార్ సోమవారం పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింగపూర్‌లో సమావేశాలు జరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'కొందరు బీజేపీ నేతలు వేరే పార్టీ నేతలతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ సమాచారం అందిందని.. ఇక్కడో, ఢిల్లీలోనో సమావేశం నిర్వహించలేకపోయారు. అందుకే అక్కడ టిక్కెట్ బుకింగ్ జరుగుతోంది' అని శివకుమార్ అన్నారు. ఇద్దరు శత్రువులు మిత్రులు అవుతున్నారని సూచిస్తూ.. బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) చేతులు కలిపాయని, రాజకీయ వ్యూహాలు తనకు తెలుసునని అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి.. మేం కూడా చూస్తాం.. మా దగ్గర కూడా కొంత సమాచారం ఉంది.. ఇదీ వారి వ్యూహం.. బెంగళూరులో చేసేది కాకుండా బయట ఇదంతా చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏమైనా కుట్ర జరుగుతోందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. శివకుమార్ వాదనను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ సమర్థించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ "ఎన్నికైన అనేక ప్రభుత్వాలను బిజెపి పడగొట్టింది, ఈ నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండాలి. బిజెపికి మంచి చెడుల స్పృహ లేదు. అది చేసిన అప్రజాస్వామిక కార్యకలాపాలన్నీ మన ముందు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ ప్రత్యేకత ఉందని రెవెన్యూ మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కాగా కర్నాటక మంత్రివర్గంలో చోటు కోల్పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, బీకే హరిప్రసాద్ తిరుగుబాటు బాట పట్టారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సవాల్ విసిరారు. తనపై జరిగిన కుట్రను వెలికితీసేందుకు వెనుకబడిన తరగతులకు చెందినవారంతా ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన హరిప్రసాద్ వ్యాఖ్యలు కర్ణాటక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించడంతో...కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. #congress #bjp #karnataka #national-politics #dk-shivkumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి