Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..! అందుకే గంజాయి సేవించా: షణ్ముఖ్‌ సంచలనం!

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని.. ఈ డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకే గంజాయి సేవించానని చెబుతున్నాడు బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌. అయితే కొన్నేళ్లుగా తన అన్నయ్య సంపత్‌ ఫ్లాట్‌లో షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తున్నాడని టాక్‌. ఈ కేసుపై మరిన్ని వివరాల కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..! అందుకే గంజాయి సేవించా: షణ్ముఖ్‌ సంచలనం!

Shanmukh Ganjai Case Updates: యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నానని షణ్ముఖ్‌ (Shanmukh Jaswanth) చెబుతున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని.. ఈ డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకే గంజాయి సేవించానంటున్నాడు. ఇటీవల షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌పై (Sampath Vinay) ఓ యువతి ఫిర్యాదు చేయగా.. సంపత్‌ ఇంటికి వెళ్లారు పోలీసులు. సంపత్‌ ఇంటిలో గంజాయి సేవిస్తూ షణ్ముఖ్‌ కనిపించాడు. దీంతో సంపత్‌, షణ్ముఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిన్న(ఫిబ్రవరి 24) శనివారం బెయిల్‌పై షణ్ముఖ్‌ విడుదలయ్యారు.

మరోవైపు షణ్ముఖ్, సంపత్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2016లో థింక్‌ షేక్‌ ఫ్రాంచైజీ పేరుతో యువతికి సంపత్‌ టోకరా వేసినట్టు సమాచారం. కంపెనీలో పెట్టుబడి కోసమని రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశాడట. నెలకు రూ7 వేలు లాభం అంటూ మాయమాటలు చెప్పినట్టుగా తెలుస్తోంది. సంపత్‌ మోసం చేసినట్లు గుర్తించిన యువతి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగింది. అయితే ఆ యువతిని సంపత్‌ బ్లాక్‌ మెయిల్‌ చేశాడని తెలుస్తోంది. ఒక యువతితో నిశ్చితార్థం, మరో యువతతో సంపత్‌ వివాహాం చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..?
డ్రగ్స్‌ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ అరెస్ట్(Shanmukh Arrest) అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పోలీసులకు గంజాయితో పట్టుబడ్డాడు. తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులకు సంపత్ ఫ్లాట్ లో గంజాయితో పాటు షణ్ముఖ్ బుక్కయ్యాడు. దీంతో షణ్ముఖ్, సంపత్ ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అటు షార్ట్‌ ఫిల్మ్స్‌లో ఛాన్స్‌ ఇప్పిస్తానంటూ షణ్ముఖ్‌ యువతులను మోసం చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా సంపత్‌ ఫ్లాట్‌లో షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తున్నాడని టాక్‌. యూట్యూబ్‌లో అవకాశాలు ఇస్తానని చెప్పి.. షణ్ముక్‌ మోసం చేశాడని పోలీసులకు డాక్టర్ మౌనిక (Dr Monica) ఫిర్యాదు చేసింది. షణ్ముక్‌ ద్వారానే అతని అన్న సంపత్‌  పరిచయమయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. షణ్ముక్‌ అన్న సంపత్ వినయ్ హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఓసారి తనకు అబార్షన్ కూడా చేయించాడని చెప్పింది.

Also Read: పాస్‌పోర్ట్‌ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫైల్స్!

WATCH THIS YOUTUBE TRENDING VIDEO: SARIPODHAA SANIVAARAM Glimpse

Advertisment
Advertisment
తాజా కథనాలు