Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభం.. అల్లాడిపోతున్న నగర ప్రజలు యమునా నదికి ప్రవాహం తగ్గడంతో ఢిల్లీ ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో పైప్‌లైన్ల్ వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. By B Aravind 16 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం నెలకొంది. యమునా నదికి ప్రవాహం తగ్గడంతో నగర ప్రజలు నీరు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ గుర్తించింది. దీంతో జల మంత్రిత్వశాఖ కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చే ప్రధాన పైప్‌లైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రి అతిశీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. Also Read: గంగానదిలో పడవ ప్రమాదం.. ఆరుగురు గల్లంతు! యమునా నదికి ప్రవాహం తగ్గడంతో రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోందని తెలిపారు. దీనివల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టు విలువైందని.. దాని పంపిణీ వ్యవస్థను కాపాడుకోవాలని తెలిపారు. అలాగే ఢిల్లీకి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైపులైన్‌లో అనేక చోట్ల బోల్టులను తొలగించడంతో అక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. దీనివెనుక ఏదో దురుద్దేశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. నీటి పైపులను రక్షించేందుకు 15 రోజులపాటు గస్తీ నిర్వహించాలని లేఖలో పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా.. ఢిల్లీలో నీటి కొరతపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఢిల్లీ జల్ బోర్డను ధ్వంసం చేశారు. ఇది బీజేపీ నేతల పనేనని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నీటీ సంక్షోభం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. Also Read: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 11వ ఘటన #delhi #water-problem #water-crisis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి