Delhi : ఢిల్లీ మేయర్‌ ఎన్నిక వాయిదా!

ఢిల్లీ మేయర్‌ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎలెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రిసైడింగ్‌ అధికారిని నియమించలేదు. దీంతో ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు.

New Update
Delhi : ఢిల్లీ మేయర్‌ ఎన్నిక వాయిదా!

Delhi Mayor : ఢిల్లీ మేయర్‌ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌(Deputy Mayor) పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల తేదీ విడుదల అయినప్పటి నుంచి కూడా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రిసైడింగ్‌ అధికారిని నియమించలేదు. దీంతో ఈ ఎన్నికల(Elections) ను వాయిదా వేసినట్లు అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు.

‘‘ఈ ఎన్నికలు ఈసీ(EC) అనుమతి, ప్రిసైడింగ్ అధికారి నామినేషన్‌కు లోబడి ఉంటాయి. అయితే, గడువు సమీపించినప్పటికీ ప్రిసైడింగ్ అధికారి నామినేషన్ జరగలేదు. దీంతో ఎన్నికలను పోస్టుపోన్ చేస్తున్నాం’’ అని మున్సిపల్ సెక్రటరీ కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

సీఎం నుంచి సలహాలు, సూచనలు లేకుండా తన అధికారాన్ని ఉపయోగించడం సబబు కాదని ఎల్జీ వీకే సక్సేనా వెల్లడించినట్టు సివిక్ బాడీ పేర్కొంది. మరోవైపు, ఎల్జీ తీసుకున్న ఈ నిర్ణయంపై అధికార ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వాయిదాకు బీజేపీనే కారణమని, ఆ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సక్సేనా పనిచేస్తున్నారని ఆరోపించారు.

Also read: రాహుల్‌ గాంధీ భవితవ్యం తేలేది నేడే…లోక్​ సభ రెండో దశ పోలింగ్ ఈరోజే!

Advertisment
Advertisment
తాజా కథనాలు