Viral Video: నా మీద జోకులు వేస్తావా? బాలికను నడిరోడ్డుపై కత్తితో పదేపదే పొడిచిన దుర్మార్గుడు!

ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో పట్టపగలు ఓ బాలికను కత్తితో పొడిచిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను వెర్రివాడు అన్నందుకు కోపం తెచ్చుకున్న అమన్‌ బాలికపై కత్తితో దాడి చేశాడు.

New Update
Viral Video: నా మీద జోకులు వేస్తావా? బాలికను నడిరోడ్డుపై కత్తితో పదేపదే పొడిచిన దుర్మార్గుడు!

ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో పట్టపగలు బాలికపై కత్తితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమన్ అనే 22 ఏళ్ల యువకుడిను పోలీసులు పట్టుకున్నారు. సీసీటీవీలో రికార్డయిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.


కోపం ఆపుకోలేక చేశా:
ముఖర్జీ నగర్ సమీపంలోని ఓ పేయింగ్ గెస్ట్ హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు అమన్‌. కోపంతో బాలికపై దాడి చేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడు. తనను 'వెర్రివాడు' అని ఆమె పిలిచిందని పదేపదే రెచ్చగొట్టడంతో కోపం వచ్చి ఇలా చేశానని చెప్పాడు. సమీపంలోని కూరగాయల షాప్‌లో ఉన్న కత్తిని తీసుకోని బాలికపై దాడి చేశాడు. అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న స్థానికులు వేగంగా స్పందించారు. వెంటనే గొడవలో జోక్యం చేసుకోని బాలికను కాపాడారు. బాధితురాలు చిన్న గాయాలతో బయటపడింది. సీసీటీవీ ఫుటేజీలో అమన్ బాలిక వైపు దూసుకువెళ్లి ఆమెను నేలపై పడేశాడు. చుట్టుపక్కలవారు అడ్డుకునేలోపు ఆమెను పదే పదే కత్తితో పొడిచినట్లు వీడియోలో కనిపిస్తోంది. జాఫ్రాబాద్‌లో నివాసం ఉంటున్న బాధితురాలు చదువుకోవడం కోసం ముఖర్జీ నగర్‌ సమీపంలోని లైబ్రరీకి తరచూ వెళ్తుంది. ఆమె పట్ల అమన్ కోపం ఆమె ఉద్దేశించిన ఎగతాళి నుండి ఉద్భవించింది.

Also Read: ఈడీ కస్టడి నుంచే తొలి ఆదేశాలు.. ప్రభుత్వ అధికారులకు కేజ్రీవాల్‌ నోట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు