Arundati Roy: రచయిత్రి అరుంధతి రాయ్‌కు షాక్‌.. లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం

ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌కి భారీ షాక్ తగిలింది. గతంలో ఆమెపై నమోదైన యూఏపీఏ కేసులో చట్టం ప్రకారం శిక్షించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్‌ సక్సేనా ఆమోదం తెలిపారు.

New Update
Arundati Roy: రచయిత్రి అరుంధతి రాయ్‌కు షాక్‌.. లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం

ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌కి భారీ షాక్ తగిలింది. గతంలో ఆమెపై నమోదైన యూఏపీఏ కేసులో చట్టం ప్రకారం శిక్షించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్‌ సక్సేనా ఆమోదం తెలిపారు. 2010లో ఢిల్లీలోని 'అజాదీ-ది ఓన్లీ వే' అనే పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరు చేయడం లాంటి అంశాలపై చర్చలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని అరుంధతి రాయ్‌పై, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్‌కు చెందిన షేక్ షౌకత్‌ హుస్సెన్‌పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా యూఏపీఏ చట్టం ప్రకారం వీళ్లను శిక్షించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్‌ సక్సేనా ఆమోదం తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు