MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..

ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ లభిస్తుందని ఆశించిన కవితకు నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..

MLC Kavitha Bail Petition: ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు (Delhi High Court). ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నిన్న ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రోజు విచారణ చేపట్టింది ఢిల్లీ హైకోర్టు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించడానికి ఈడీ సమయం కావాలని కోరింది. దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

కవితకు బెయిల్ మరింత ఆలస్యం అవుతుండడంతో.. ఆమె కుటుంబ సభ్యులతో పాటు, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఇదే కేసులో సీబీఐ (CBI) ఆమెను ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు కవితను తీహార్ జైలుకు తరలించారు.

Also Read: కేటీఆర్‌ రాళ్ల దాటి ఘటన.. 23 మంది అరెస్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు