IPL 2024: దిల్లీ క్యాపిటల్స్ జట్టు అప్డేట్స్ !

ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటి వరకు టైటల్ గెలవని జట్ల జాబితాలో దిల్లీ క్యాపిటల్స్ ఒకటి. 15 నెలల తర్వాత క్రికెట్ మైదానం లోకి అడుగుపెడుతున్న రిషబ్ పంత్ పైనే ఇప్పుడు చూపంతా.తాజా గా దిల్లీ క్యాపిటల్స్ సీజన్ లో ఆడే ఆటగాళ్ల స్థానాలపై అప్డేట్ విడుదల చేసింది.

New Update
IPL 2024: దిల్లీ క్యాపిటల్స్ జట్టు అప్డేట్స్ !

నేటి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ డిఫెండిగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బెంగళూరు చిదంబరం స్టేడియం వేదికగా టోర్నిలో మొదటి మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండవ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ తో దిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 15 నెలల తర్వాత క్రికెట్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు.

ఐపీఎల్ ప్రారంభమైన 16 ఏళ్లలో దిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. కాని ఈ సీజన్ లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దృష్టంతా టైటిల్ పైనే ఉంది. అతడికి మద్ధతుగా  రికిపాంటింగ్ కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దిల్లీ జట్లు యువబ్యాటర్లతో ఉత్సాహంగా కన్పిస్తుంది. బౌలింగ్  ,మిడిలార్డర్ లో బ్యాటింగ్ కూడా బలంగా కన్పిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో పృథ్వీషా,డేవిడ్ వార్నర్, యశ్ దుల్ ,రికీ భుయ్, జేక్ ఫ్రెజర్, లు ఉండగా ఆల్ రౌండర్ కోటాలో మిఛెల్ మార్ష్, లలిత్ యాదవ్ ,అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

ట్రిస్బన్ స్టబ్స్,షాయ్ హోప్, అభిషేక్ పోరల్,కుమార్ క్రూయల్ వికేట్ కీపింగ్ లో రిషబ్ పంత్ కు బ్యాకేండ్ వికెట్ కీపర్లు గా ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ముఖేష్ కుమార్,కులదీప్ యాదవ్,ఇషాంత్ శర్మ,ఖలీల్ అహ్మాద్ లాంటి అనుభవజ్ఞ ఆటగాళ్లు ఉన్నారు. విదేశీ ఫాస్ట్  బౌలర్లుగా జాయ్ రిచర్డ్స్ న్, ఎన్రీక్ నార్సియా ఉన్నారు.

పంజాబ్ కింగ్స్ జట్టుతో దిల్లీ జట్టుకు చెందిన ఈ 11 మంది ఆటగాళ్లకు అవకాశం ఉంది.

1.పృథ్వీషా,డేవిడ్ వార్నర్,మిఛెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్),ట్రిస్బన్ స్టబ్స్,లలిత్ యాదవ్, అక్షర్ పటేల్,ముఖేష్ కుమార్,కులదీప్ యాదవ్ ,జాయ్ రిచర్డ్స్ న్,ఇషాంత్ శర్మ.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

New Update
Rains

Rains

ఉపరితల ఆవర్తనం వల్ల మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుంచి 40 కిమీ వరకు గాలులు ఉండవచ్చని తెలిపింది.

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహూబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇదిలా ఉండగా.. ఏపీలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాలులు కూడా తీవ్రంగా వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment