cyclone: తుఫాన్ గా మారిన తీవ్ర వాయుగుండం..కోస్తాంధ్ర పై తీవ్ర ప్రభావం! మిచౌంగ్ తుఫాన్ నెల్లూరుకు 440 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నెల 5 న నెల్లూరు- మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. By Bhavana 03 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయానికి మిచౌంగ్ (Michoung) తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తీరానికి చేరువలోకి వచ్చింది. నెల్లూరుకి ఆగ్నేయంగా ఇది సుమారు 440 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తుఫాన్ గా మరింత బలపడి డిసెంబర్ 5 న మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్రలో చాలా ప్రదేశాల్లో ఓ మోస్తరు వర్షాలు నుంచి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. సోమవారం, మంగళవారం నాడు యానాంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏపీ రాయలసీమలో ఆదివారం , సోమవారం చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో డిసెంబర్ 6 (బుధవారం) విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించింది. ఏపీ తీర ప్రాంత జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు. వాయు గుండం తీవ్రత వల్ల సముద్రం తీవ్రంగా ఉంటుందని మత్స్యకారులు ఎవరూ కూడా బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మిచౌంగ్ తుఫాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాలో ఒక మీటరు నుంచి ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ స్పష్టం చేసింది. also read: నో హంగ్.. కాంగ్రెస్ కు మేజిక్ ఫిగర్! #nellore #ap #imd #machilipatnam #cyclone #mocoung మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి