Karnataka:కర్ణాటకలో చీకట్లు...కరెంట్ లేక అవస్థలు పడుతున్న జనాలు By Manogna alamuru 04 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఉచితంగా 5గంటలు కరెంట్ ఇస్తామని కర్నాటకలో కాంగ్రెస్ ప్రచారం చేసింది. దీంతో పాటూ 5 గ్యారంటీలు అంటూ ఊదరగొట్టింది. మరి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అవన్నీ నెరవేరుస్తోందా అంటే...మాకేమీ కనిపించడం లేదని ఏక కంఠంతో చెబుతున్నారు కర్ణాటక ప్రజలు. కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. 5 గంటలు కాదు కనీసం రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఆ రెండు గంటల్లో కూడా పది నిమిషాలకొకసారి ఆపేస్తున్నారని...దాని వలన మోటార్లు పాడయిపోతున్నారని తెలిపారు. నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి. కర్ణాటకలోని పల్లెల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కదిపితే ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతున్నారు. 5 గ్యారంటీలు అడిగితే ఏకంగా తిట్టిపోస్తున్నారు కూడా. కరెంట్ లేదు...ప్రభుత్వం ఇస్తానన్న రేషన్, డబ్బులు ఇవ్వడం లేదు. ఎలా బతకాలో తెలియడం లేదంటూ వాపోతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 కిలోల బియ్యం ఇచ్చేది...ఇప్పుడు మూడు కిలోలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా నెల మొదలయ్యాక మొదటి మూడు రోజులు వెళితేనే రేషన్ ఉంటోంది. తరువాత వెళితే అయిపోయింది అని చెబుతున్నారని అంటున్నారు. అయితే మమిళలకు ఉచిత ప్రయాణం మాత్రం బాగా అమలు అవుతోందని చెప్పారు. కానీ దాని వలన ఎవరికి ఏం లాభం ఉండటం లేదని అంటున్నారు. పైగా దీనివలన ట్యాక్సీ, ఊబర్ లాంటి సర్వీసులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సరిగా వర్షాలు పడలేదని, డ్యాముల్లో నీరు లేదని అన్నారు. దీని కారణంగా విద్యుత్తు ఉత్పత్తి కావడం లేదని, 7 గంటల విద్యుత్తు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి. రాబోయే రోజుల్లో పక్క రాష్ర్టాల నుంచి కరెంట్ కొని రైతులకు కరెంట్ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో 17మిలియన్ వాట్ల విద్యుత్ మాత్రమే ఉంది. దాన్ని కూడా ఫేజ్ ల వారీగా ఇస్తున్నారు. #congress #public #karnataka #electricity మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి