Canada India tensions : దెబ్బతిన్న కెనడా, భారత్‌ దౌత్య సంబంధాలు..ఈ కంపెనీల్లో ఆందోళన!!

భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు హీనస్థితికి చేరుకుంటున్నాయి. ఖలీస్థానీ అతివావ భావజాలం రెండు దేశాల మధ్య అగ్గిరాజేసింది. రెండుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన నష్టాన్ని చవిచూడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా లక్షలకోట్లలో పెట్టుబడి పెట్టిన 30 భారతీయ కంపెనీలకు ముప్పు పొంచి ఉంది.

New Update
Canada India tensions : దెబ్బతిన్న కెనడా, భారత్‌ దౌత్య సంబంధాలు..ఈ కంపెనీల్లో ఆందోళన!!

భారత్, కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఖలీస్తానీ భావజాలం రెండు దేశాలమధ్య నిప్పురాజేసింది. ఎంతకోరినా ట్రూడ్ అతివాదాన్ని అణచివేడంలో విఫలమయ్యారు. తాజాగా మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉన్నట్లు ట్రూడ్ ఆరోపించడం సంచలనంగా మారింది. అంతేకాదు మన దేశ దౌత్యవేత్తను కూడా ట్రూడో బహిష్కరించారు. కేంద్రం కూడా అంతే దీటుగా స్పందించింది. కెనడా దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టిన కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి.

కెనడా, భారతదేశం మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత 30 భారతీయ కంపెనీల ఆందోళనను పెంచింది. ఈ కంపెనీలు కెనడాలో రూ. 40,446 కోట్లు పెట్టుబడి పెట్టాయి. వారు తమ వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తున్నారు. అయితే ఇరు దేశాలమధ్య వివాదం కారణంగా వారి ప్రణాళికలు మారవచ్చు. ఈ కంపెనీలలో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో, అదానీ గ్రూప్ మరియు L&T ఉన్నాయి. ఈ కంపెనీలు కెనడాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులు పెడుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఈ ఆకులు డెంగ్యూని దూరం చేస్తాయట..!!

ఇటు భారత కంపెనీల్ల కెనడా పెన్షన్ బోర్డు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పెట్టుబడులు పెట్టింది. వీటి విలువ లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. జూన్‌ త్రైమాసికానికి డెల్హీవరీలో కెనడా ఫెన్షన్‌ ఫండ్‌కు 6శాతం వాటా ఉంది. కెనడా భారతదేశం యొక్క 12వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2022లో, భారతదేశం నుండి కెనడాకు ఎగుమతులు $10.7 బిలియన్లు కాగా, కెనడా నుండి భారతదేశానికి దిగుమతులు $12.5 బిలియన్లుగా ఉన్నాయి. ఉద్రిక్తత కారణంగా, ఈ వాణిజ్య సంబంధాలు దెబ్బతినవచ్చు, ఇది కెనడియన్ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చు.

ఇక్కడ జొమాటో, పేటీఎం, నైకా వంటి కంపెనీల్లోనూ సీపీపీఐబీ భారీగా పెట్టుబడులు పెట్టింది. జొమాటలో రూ.2,078 కోట్లు, పేటీఎంలో రూ.973 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం పేటీఎంలో సీఈవో విజయ శేఖర శర్మకే అధిక వాటా ఉంది . ఇండస్‌ టవర్స్‌లో కెనడా పెన్షన్‌ ఫండ్‌ 2.18 శాతం వాటా ఉండగా...సోమవారం నాటి ముగింపు ధరతో లెక్కిస్తే ఈ విలువ రూ.1,085 కోట్లుగా తేలింది. ఫ్యాషన్‌, దుస్తులు, సౌందర్య సాధనాల విక్రయాల కంపెనీ నైకాలో సీపీపీఐబీకి 1.47 శాతం వాటా జూన్‌ త్రైమాసికానికి రూ.625 కోట్లు.

ఇది కూడా చదవండి: రిటైరయ్యాక ఎవరి పంచనా చేరక్కర్లేదు..ఈ స్కీమ్స్‎లో పెట్టుబడి పెడితే చాలు..!!

-భారతీయ కంపెనీలు కెనడాలో తమ పెట్టుబడులను తగ్గించవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు.
-కెనడాలో భారతీయ ఉత్పత్తులు,సేవలకు డిమాండ్ తగ్గవచ్చు.
-కెనడాలో భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గవచ్చు.
-ఒత్తిడి తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు