Daggubati Rana : అఘోర పాత్రలో దగ్గుబాటి రానా.. షాకింగ్ విషయం బయటపెట్టిన టాలీవుడ్ హీరో!

'లవ్ మౌళి' సినిమాలో దగ్గుబాటి రానా అఘోరాగా ఒక ముఖ్య పాత్ర పోషించారట. హీరో నవదీప్ ఈ విషయాన్ని తాజా ప్రెస్ మీట్ లో బయటపెట్టాడు. తనతో ఉన్న స్నేహంతో.. తనకేదైనా చేయాలనిపించి రానా ఈ పాత్ర చేశాడని తెలిపాడు.

New Update
Daggubati Rana : అఘోర పాత్రలో దగ్గుబాటి రానా.. షాకింగ్ విషయం బయటపెట్టిన టాలీవుడ్ హీరో!

Daggubati Rana In Love Mouli Movie : ఒకప్పుడు టాలీవుడ్ (Tollywood) లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్ (Navdeep).. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా రవితేజ 'ఈగల్' మూవీలో కనిపించిన నవదీప్.. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా 'లవ్ మౌళి' (Love Mouli) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పటీకే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 7 న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నవదీప్ తాజాగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.

Also Read : పోస్టర్ డిజైనర్స్ కు బంపర్ అఫర్.. ప్రశాంత్ వర్మ సినిమాల్లో పనిచేసే అవకాశం..?

అఘోర పాత్రలో రానా

తాజా ప్రెస్ మీట్ లో నవదీప్ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. సినిమాలో దగ్గుబాటి రానా (Daggubati Rana) కూడా నటించాడని తెలిపాడు." రానా ఈ సినిమాలో అఘోరాగా ఒక ముఖ్య పాత్ర పోషించారు. నిజానికి ఆయనకు ఈ పాత్ర చేయాల్సిన అవసరం లేదు. నాతో ఉన్న స్నేహంతో.. నాకేదైనా చేయాలనిపించి తనీ పాత్ర చేశాడు. దాన్ని నాకు కమర్షియల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈరోజు వరకు కూడా రానా ఈ సినిమా చేశాడని బయట పెట్టలేదు.

సినిమాలో ఆయన ఆ పాత్ర చేయకుంటే మా దర్శకుడు దాన్ని చేసేవారు. ఏదేమైనా రానా పాత్ర కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తను తెరపై కనిపించిన తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది" అని చెప్పుకొచ్చాడు. నవదీప్ కామెంట్స్ తో రానా కూడా లవ్ మౌళి మూవీలో నటించాడననే విషయం బయటకి రావడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు