TDP BJP: ఢిల్లీలో నడ్డాతో చంద్రబాబు, పురంధేశ్వరి భేటీ.. ఏం మాట్లాడుకున్నారు? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముగ్గురు నేతలు ప్రొగ్రెం ముగిసిన తర్వాత కలిసి మాట్లాడుకున్నారు. పొత్తులపైనే చర్చ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. By Trinath 28 Aug 2023 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AP Politics: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandeswari), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)తో భేటీ అయ్యారు. ఈ ముగ్గురూ ఏం చర్చించారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చర్చించారంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌పై నాణెం విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం హాజరవగా.. ఈ ప్రొగ్రెమ్ సందర్భంగా ముగ్గురూ ప్రత్యేక సమావేశం అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పొత్తు గురించేనా? ప్రస్తుతం ఏపీలో జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి. టీడీపీ ఎవరితోనూ ఇప్పటివరకు అయితే పొత్తు పెట్టుకోలేదు. అయితే 2014లో లాగా బీజేపీ-జనసేన-టీడీపీ (BJP,Janasena & TDP) కలిసి పని చేసి జగన్‌ని ఓడించాలని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆలోచిస్తున్నట్టు చాలా కాలంగా పొలిటికల్ సర్కిల్స్‌లో ఒకటే టాక్ వినిపిస్తోంది. బీజేపీని టీడీపీకి దగ్గర చేసేందుకు పవన్ చాలా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అమిత్‌షాతో చంద్రబాబు భేటీ కూడా అయ్యారు. ఇక తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన ఉంటుందని అంతా భావించినా ఎలాంటి ముందడుగు పడినట్టు కనిపించలేదు. ఇదే సమయంలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్రం నాణెలు విడుదల చేసింది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగగా.. ఈ ప్రొగ్రెమ్‌కి జేపీ నడ్డా, పురంధేశ్వరీ, చంద్రబాబు వచ్చారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ చంద్రబాబు నడ్డా మాట్లాడుకుంటున్నట్టే కనిపించారు. ఇక నాణెం విడుదల చేసిన తర్వాత ముగ్గురూ మాట్లాడుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించే ముగ్గురూ చర్చించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి అధికార వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా జనసేన, టీడీపీ పావులు కదుపుతున్నాయి.. అటు బీజేపీ మాత్రం వైసీపీని ఓవైపు విమర్శిస్తూనే మరోవైపు పార్లమెంట్‌లో జరిగే బిల్లుల కోసం జగన్ సపోర్ట్ కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటివలి జరిగిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనూ బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు వైసీపీ మద్దతిచ్చింది. అనుకూలంగా ఓటు వేసింది. కానీ ఇదంతా రాజకీయ స్వలాభమే కోసమేనని.. బీజేపీ కూడా వైసీపీని గద్దే దించాలనే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో చంద్రబాబు, నడ్డా, పురంధేశ్వరి భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR) జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద 100 రూపాయల నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఎన్టీఆర్ రూ.100 నాణేన్ని విడుదల చేశారు. ALSO READ: ఎన్టీఆర్ నాణెం విడుదల.. ఆయన గురించి ముర్ము ఏం అన్నారంటే! #tdp #bjp #ap-politics #jp-nadda #chandrababu-meeting-with-nadda #purandeswari-meeting-with-nadda #chandrababu-meeting-with-jp-nadda-in-delhi #chandrababu-met-jp-nadda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి