Dadasaheb Phalke Award: సుకుమార్ కూతురుకు ఉత్తమ బాలనటి అవార్డు.. ఏ సినిమాకో తెలుసా! ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బాలనటిగా మెప్పించింది. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నటించిన ఆమె ఉత్తమ పరిచయ బాలనటిగా ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ పురస్కారం అందుకుంది. సుకృతిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. By srinivas 01 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sukumar's Daughter Sukriti Wins Award: స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న బాలిక ఉత్తమ పరిచయ బాలనటిగా (బెస్ట్ డెబ్యూ చైల్డ్ యాక్టర్) ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ (Dadasaheb Phalke Award) పురస్కారం అందుకుంది. గాంధీ తాత చెట్టు.. ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశంగా పద్మావతి మల్లాది తెరకెక్కించిన ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Thatha Chettu) చిత్రంలోని నటనకు గానూ ఈ అవార్డు దక్కించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన సినిమాకు తబిత సమర్పకురాలుగా వ్యవహరించారు. ఇప్పటికే పలు సినీ వేదికలపై మెరిసిన చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఇది కూడా చదవండి: Khammam: మా మామను గెలిపించండి.. రాఘురాం రెడ్డికి మద్దతుగా హీరో వెంకటేష్ కూతురు! ఇక భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ఢిల్లీలో 14వ ఫిల్మ్ ఫెస్టివల్‌ను మంగళవారం నిర్వహించి, విజేతలకు పురస్కారాలు అందజేశారు. ‘మంగళవారం’ చిత్రానికి సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డులు దక్కాయి. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాకిగానూ నవీన్ చంద్ర (Naveen Chandra) ‘బెస్ట్ యాక్టర్’గా అవార్డు స్వీకరించారు. #sukumar #sukrita #gandhi-thatha-chettu #dadasaheb-phalke-award మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి