Telangana: ఉద్యోగులకు శుభవార్త...ఆగస్ట్‌ 15 తరువాత డీఏ ప్రకటన!

ఆగస్టు 15 తరువాత డీఏ ప్రకటిస్తామని...ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

New Update
AP Pensions: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

DA For Telangana Employees: ఆగస్టు 15 తరువాత డీఏ ప్రకటిస్తామని...ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఆగస్టు 15 తరువాత ఉపాధ్యాయ , ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ ప్రకటిస్తామని తెలిపారు.

అది ఒకటా..రెండా అనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని నరేందర్‌ రెడ్డి తెలిపారు. యూయస్సీసీ, జాక్టో ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ కోదండ రాం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అపాయింట్‌ మెంట్ కోరగా..ముందుగా నరేందర్‌ రెడ్డి తో చర్చించమని సూచించారు. బదిలీలు, పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని సంఘాల నాయకులు అభినందించారు.

బదిలీలు, పదోన్నతుల్లో ఏర్పడిన సమస్యలపై అప్పీల్స్‌ ను సత్వరమే పరిష్కరించాలని కోరగా...పరిష్కరించమని అధికారులను ఆదేశిస్తామన్నారు.

Also Read:  ఒలింపిక్స్ పరేడ్‌లో మెరిసిన భారత జెండా

Advertisment
Advertisment
తాజా కథనాలు