Cyber Crime: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులకు సైబర్‌ నేరగాళ్ల వల..టికెట్ కోసం డబ్బులివ్వాలని ఫోన్లు

సైబర్ నేరగాళ్ళ నేరాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. సామాన్య మానవుల దగ్గర నుంచి రాజకీయనేతల వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు.

New Update
Cyber Crime: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులకు సైబర్‌ నేరగాళ్ల వల..టికెట్ కోసం డబ్బులివ్వాలని ఫోన్లు

Cyber Criminals Calls To Kadiyam Kavya: టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలకు పాల్పడేవారి సంఖ్యకు కొదువేం లేదు. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విసయాల వరకూ కూడా ఎడాపెడా నేరాలు చేసేస్తున్నారు. ఉన్నచోట నుంచే కదలకుండా డబ్బులు గుంజేస్తున్నారు. ఇప్పుడు పైబర్ క్రైమ్ రాజకీయాల వరకూ కూడా పాకేసింది. తాజాగా కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్ధులకు సైబర్ నేరగాళ్ళు వలలు వేస్తున్నారు. టికెట్‌ల ఆశ చూపించి డబ్బులు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాజకీయ నేతలకు ఫోన్లు..
ప్రస్తుతం దేశం మొత్తం ఎలక్షన్స్ హాడావుడి నడుస్తోంది. పార్టీలు అన్నీ అభ్యర్ధులను ఎన్నుకోవడం, ప్రకటించడం చేస్తున్నాయి. చాలా పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించేశాయి. మరికొన్ని పార్టీల్లో ఇంకా లాబీయింగ్‌లు నడుస్తున్నాయి. దీనినే తమ ఆయుధంగా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కోసం డబ్బులు చెల్లించాలని నేతలకు ఫోన్లు చేస్తున్నారు. AICC నుంచే ఫోన్లు చేస్తున్నామని మరీ నమ్మిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ అనుబవాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.

కడియం కావ్యకు ఫోన్..
వరంగల్‌ అభ్యర్థి కడియం కావ్యకు సైతం ఇలాంటి ఫోన్ వచ్చిందని తెలుస్తోంది. టికెట్ కావాలంటే రూ.76 వేలు ఇవ్వాలని నేరగాళ్ళు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చి కావ్య తండ్రి శ్రీహరికి చెప్పారు. దీంతో ఆయన నిజమేనా అంటూ గాంధీభవన్‌ వర్గాలతో మాట్లాడగా అసలు విషయం బయటపడింది. అదేం లేదంటూ గాంధీభవన్‌ వర్గాలు సమాచారం ఇచ్చారు.

గాంధీభవన్‌ నుంచే సమాచారం...
అయితే సైబర్ నేరగాళ్ళు పక్కా సమాచారంతోనే నేరాలకు పాల్పడుతున్నారు. గాంధీభవన్‌ నుంచే సమాచారం తీసుకుని మరీ ఫోన్లు చేస్తున్నారు. ఏఐసీసీ నుంచి ఫోన్‌ చేస్తున్నామని, అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని అడుగుతున్నారు. గాంధీభవన్‌లో సిబ్బంది ఇచ్చిన వివరాల ఆధారంగానే.. ఎంపీ అభ్యర్థులకు సైబర్‌ నేరగాళ్ళు ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కావ్యతో పాటూ ఇంకెంత మందికి ఫోన్‌ చేశారోననే అనుమానం వ్యక్తం అవుతోంది.

Also Read:IPL-2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌ న్యూస్..సూర్య వచ్చేస్తున్నాడు

Advertisment
Advertisment
తాజా కథనాలు