Cyber Crime: అమాయకులే టార్గెట్.. నమ్మించి నట్టేటా ముంచుతున్న కేటుగాళ్లు! అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగులు, రేప్, డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్న వారిని బెదిరిస్తూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా రూ.70 లక్షలకు పైగా కొట్టేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. By srinivas 10 Aug 2024 in బిజినెస్ క్రైం New Update షేర్ చేయండి Cyber Crime: ప్రజలు, బ్యాంకులు డబ్బుల విషయంలో ఎంత పకడ్బందీగా ఉంటున్న సైబర్ నేరగాళ్లు అడ్డదారుల్లో దోచేస్తూనే ఉన్నారు. అమాయకులు, కేసుల్లో ఇరుక్కున్న బాధితులే లక్ష్యంగా చేసుకుని నట్టేటా ముంచేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నగరల్లో సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే రిటైర్డ్ మహిళా ఉద్యోగిని బెదిరించి సైబర్ చీటర్స్ రూ.22 లక్షలు కాజేసిన విషయం తెలిసిందే. కాగా ఆమె పేరుమీద హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డ్రగ్స్ పార్సిల్ అవుతున్నాయని బెదిరించి బుట్టలో వేసుకున్నారు. దీంతో వాళ్లు చెప్పినట్లుగానే ఆమె ట్రాన్స్ ఫర్ చేసింది. చివరికి కొడుకు ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న సొమ్ము.. ఇదిలా ఉంటే.. ఇంటి నిర్మాణం కోసం రామేశ్వర్ అనే వ్యక్తి బ్యాంకులో దాచుకున్న రూ.11 లక్షలను చాలా తెలివిగా కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. యూనియన్ బ్యాంకుకు సంబంధించిన ఏపీకే యాప్ లింక్‌తో ఫేక్ మెసేజ్ పంపించి బురిడి కొట్టించారు. బ్యాంకు ఖాతా సేఫ్టీ కోసం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించి.. ఫోన్ ఔట్ గోయింగ్ కాల్ వెళ్లకుండా చేసి అదే రోజు రాత్రి రూ.7 లక్షలు, మరుసటి రోజు రూ.4.21 లక్షలు మొత్తంగా మూడు రోజుల్లో మొత్తంగా 16 లావాదేవీల ద్వారా రూ.11.21 లక్షలు దొబ్చేశారు. ఫోన్ కలవడం లేదని అనుమానం వచ్చిన బాధితుడు రి పేరు సెంటర్‌కు వెళ్లగా అసలు విషయం బయటపడింది. డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇది కూడా చదవండి: Nyjah Huston: వారానికే రంగు పోయింది.. ఒలింపిక్ పతకాలపై అథ్లెట్ పోస్ట్ వైరల్! ఇక హైదరాబాద్‌లో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగుల నుంచి సుమారు రూ. 43 లక్షలను కాజేశారు. ఆర్బిఐ అధికారి పేరుతో సిటీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని బురిడీ కొట్టించారు. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉపయోగించి క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ నడుస్తున్నాయంటూ బెదిరించి అడ్డంగా దోచేశారు. #hyderabad #cyber-criminals #70-lakhs-illegally-looted మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి