Hyderabad: హైదరాబాద్‌లో ముగిసిన సిడబ్ల్యూసి సమావేశాలు.. విజయ భేరి సభకు ప్రియాంక దూరం.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సిడబ్ల్యూసి సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. తెలంగాణలోనూ విజయం సాధించడం, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. By Shiva.K 17 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CWC Meeting in Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad)లో ఏర్పాటు చేసిన సిడబ్ల్యూసి(CWC) సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో కాంగ్రెస్(Congress) అగ్రనేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. తెలంగాణలోనూ విజయం సాధించడం, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ రాష్ట్రాలపై నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. కర్నాటక మోడల్‌లోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇక పోతే.. తెలంగాణ ప్రలజ కోసం సిడబ్ల్యూసి సభ్యులు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎన్నికలపై కీలక నిర్ణయం.. తెలంగాణ ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ కర్నాటకలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర నాయకత్వం ఐక్యంగా ఉంటే ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చునని పార్టీ హైకమాండ్ అభిప్రాయపడింది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సిడబ్ల్యూసీ సభ్యులు. విజయ భేరి సభకు ప్రియాంక దూరం.. హైదరాబాద్‌లో సిడబ్ల్యూ సమావేశాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపునిచ్చాయి. అయితే, ఇదే సమయంలో పార్టీ శ్రేణుల్లో ఆందోళనను రేకెత్తించే చర్చ నడుస్తోంది. ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో జరుగబోయే కాంగ్రెస్ 'విజయభేరి' సభకు ఆ పార్టీ ముఖ్య నాయకురాలు ప్రియాంక దూరంగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలియదు గానీ.. ఆమె సభకు దూరం ఉండటం పొలిటికల్ సర్కిల్‌లో రకరకాల ఊహాగానాలకు తెరలేపుతోంది. సిడబ్ల్యూసీ మీటింగ్ అనంతరం తాజ్‌కృష్ణ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రియాంక గాంధీ వెళ్తారని సమాచారం. అక్కడి నుంచి ఆమె నేరుగా ఢిల్లీ బయలుదేరుతారట. ఇక సిడబ్ల్యూసీ అగ్ర నేతలంతా మరికాసేపట్లో తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి తుక్కుగూడ సభకు వెళ్లనున్నారు. విజయభేరి సభకు భారీగ జన సమీకరణ.. తుక్కుగూడలో నిర్వహిస్తున్న విజయ భేరి సభకు భారీ జన సమీకరణ చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సిడబ్ల్యూసీ నేతలు. కీలక నిర్ణయాలు.. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, జమిలీ ఎన్నికలు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ఇదే సమయంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో 405 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తుచేసిన కాంగ్రెస్ నేతలు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో చరిత్ర సృష్టించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లతో తెలంగాణలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని సీడబ్ల్యూసీ నేతలు అన్నారు. కాగా, ఆదివారం సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ ఎన్నికలకు సంబంధించిన ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించనున్నారు. "విజయభేరీ"కి కదలిరా ఓ కౌలు రైతన్న.. నిన్ను రైతుగా గుర్తించని ఈ దగా కోరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. భూమి ఉన్న రైతులతో సమానంగా, కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి.. రా.. కదలిరా.. #VijayaBheri pic.twitter.com/dBhaqhDBYS — Telangana Congress (@INCTelangana) September 17, 2023 సత్తుపల్లి నియోజకవర్గం: తుక్కుగూడ "కాంగ్రెస్ విజయ భేరి సభ " కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ తో సత్తుపల్లి నుండి సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో బయలు దేరిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు, డాక్టర్ మట్టా రాగమయి గారు.… pic.twitter.com/aO5XIdYNJu — Telangana Congress (@INCTelangana) September 17, 2023 Also Read: Asia Cup 2023 final Live Score🔴: ఒకే ఓవర్‌లో 4 కీలక వికెట్లు కోల్పోయిన శ్రీలంక Vegh S60: వెగ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 120+ కి.మి రేంజ్.. ధర, ఫీచర్ల వివరాలివే.. #congress #telangana #telangana-elections #cwc-meeting-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి