Health Tips : ఈ లాభాల కోసమైన కీర దోసకాయ తినాల్సిందే!

సమ్మర్‌లో డైట్‌పై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కచ్చితంగా హైడ్రేషన్ అందించాలి. దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి తెలుసుకోండి.

New Update
Health Tips : ఈ లాభాల కోసమైన కీర దోసకాయ తినాల్సిందే!

Heat : రోజురోజుకి ఎండలు(Summer) పెరుగుతున్నాయి. వేడి కారణంగా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్‌(Health Problems) ని ఫేస్ చేస్తున్నారు. అదే విధంగా, తగినంత పోషకాలు అందించాలి. సమ్మర్‌లో రోజూ దోసకాయ తినడం మంచిది. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. ఎండాకాలంలో దోసకాయ(Cucumber) తింటే అనేక లాభాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.

వేడి వాతావరణంలో శరీరాన్ని లోపల్నుంచి కూడా చల్లబరచడం చాలా ముఖ్యం. హాట్ సీజన్ స్నాక్‌గా దోసకాయని తీసుకోవాలి. దోసకాయని ఆహారంలో తీసుకోవటం వల్ల గుండె జబ్బులని(Heart Problems) దూరం చేసుకోవచ్చుఇందులో వాటర్ కంటెంట్, ఫైబర్ జీర్ణక్రియని ఈజీ చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలకు కూడా దోసకాయ మంచిది. రోజూ సరైన మొత్తంలో దోసకాయ తినడం వల్ల జీర్ణక్రియ కూజా శుభ్ర పడుతుంది.

సమ్మర్‌లో డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. దీన్ని దూరం చేసుకునేందుకు నీరు ఎక్కువగా తాగాలి. అదే విధంగా, దోసకాయని డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. దోసకాయ తింటే శరీర వేడి తగ్గి, జీవక్రియ మెరుగవుతుంది.దోసకాయ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియం లోపం ఉన్నవారు కచ్చితంగా వారి ఆహారంలో దోసకాయని యాడ్ చేసుకోవాలి. శరీరంలో సరైన హైడ్రేషన్‌ని నిర్వహించడానికి దోసకాయ చాలా మంచిది.

Also Read : బెంగళూరులో నివాసం ఉండే వారికి అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు.

New Update
RTC MD VC Sajjanar

RTC MD VC Sajjanar

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు. వీటి భర్తీ తర్వాత కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్  జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Also Read: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ..పేలుతున్న మాటల తూటాలు!

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని కూడా చెప్పారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారం మరో 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.     

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

గ్రూప్​1,2,3,4 పోస్టులతోపాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, హెల్త్​ డిపార్ట్​మెంట్​లో 4 వేలకు పైగా పోస్టులకు ఏప్రిల్ చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్​ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరిన్ని శాఖల ఖాళీలపై స్పష్టత రాగానే  జాబ్​క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదలకానున్నాయి. ఇక ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  నోటిఫికేషన్‌ను షెడ్యూల్​ చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం వాయిదా వేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావాల్సివుంది. 

Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

 rtv-news | rtc | jobs

 

Advertisment
Advertisment
Advertisment