RSP : కవిత అరెస్ట్ ను ఖండించిన ప్రవీణ్.. ప్రజలు మూర్ఖులు కాదంటూ విమర్శలు! లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టును ఖండించిన బీఎస్పీ చీఫ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 'అయ్యా ప్రవీణ్ సార్.. ఇన్నాళ్లు వారి స్కామ్‌లను బయపెట్టి ఇప్పుడు మాట మారుస్తున్నారా! మీరు ఎవరిని మోసం చేస్తున్నారు సార్? ప్రజలు మూర్ఖులు కాదు' అంటూ పాత పోస్టులు షేర్ చేస్తున్నారు. By srinivas 16 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Liquor Scam : లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case) లో కవిత(Kavitha) అరెస్టును ఖండించిన బీఎస్పీ చీఫ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఆమెను ఈడీ(ED) అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా దీనిపై ట్విట్టర్(X) వేదికగా స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).. మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డు పెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకమన్నారు. అంతేకాదు మోడీ బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్‌కు తెర తీశాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్(BRS) చీఫ్ మరియు మాజీ తెలంగాణ(Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR) గారి కూతురు, బిఆర్ఎస్ ఎంఎల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 15, 2024 ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం.. ఈ మేరకు ఆర్ఎస్ పీ ట్వీట్ గమనిస్తే.. 'బీఆర్ఎస్ చీఫ్, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు, బిఆర్ఎస్ ఎమ్ఎల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బీజేపీ-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెర తీశాడు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు' అన్నారు. #KCR ప్రభుత్వం అంతా ఢిల్లీలో MLC కవిత గారిని అరెస్టు కాకుండా కాపాడడంలో బిజీగా ఉంది కావున, మన నిరుద్యోగ బిడ్డలను ఇంక మనమే ఆదుకోవాలె. అందరూ ఈ Winner సంస్థ లాగా నిరుద్యోగులకు ఫ్రీగా నయినా లేదా లేదా అతి తక్కువ ఫీజులతోనయినా కోచింగ్ ఇస్తే బాగుంటది🙏 #KCRfailedTelangana #TSPSCLeakGate pic.twitter.com/bUpgITpOlz — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 20, 2023 ఇది కూడా చదవండి: Liquor scam: కేజ్రివాల్ కు షాక్ ఇచ్చిన ఈడీ.. నేడే విచారణ! అదిరేది బెదిరేది లేదు.. ఇలాంటి అక్రమ అరెస్ట్ లతో అదిరేది బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేది కాదు. ఈ దుశ్చర్య కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమే. ఈడీతో బీజేపీ- కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడి ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. దేశంలో మోడీ పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉంది. మొన్న సాయిబాబా సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో? అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీ-కాంగ్రేసులను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది' అని చెప్పారు. ప్రజలు మూర్ఖులు కాదు.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 'అయ్యా ప్రవీణ్ సార్. టీఆర్‌ఎస్ కేసీఆర్ హయాంలో స్కామ్‌లను బయటపెడుతూ రోజూ ఉండేవారు. ఇప్పుడు మీరే హఠాత్తుగా నేరేషన్ మార్చారు. మీరు ఎవరిని మోసం చేస్తున్నారు సార్? ప్రజలు మూర్ఖులు కాదు' అంటూ ఆయన పాత పోస్టులు షేర్ చేస్తున్నారు. '#KCR ప్రభుత్వం అంతా ఢిల్లీలో MLC కవిత గారిని అరెస్టు కాకుండా కాపాడడంలో బిజీగా ఉంది కావున, మన నిరుద్యోగ బిడ్డలను ఇంక మనమే ఆదుకోవాలె. అందరూ ఈ Winner సంస్థ లాగా నిరుద్యోగులకు ఫ్రీగా నయినా లేదా లేదా అతి తక్కువ ఫీజులతోనయినా కోచింగ్ ఇస్తే బాగుంటది' అనే ఎర్ఎస్ పీ పాత పోస్ట్ వైరల్ అవుతోంది. #brs #ed #rs-praveen-kumar #kavitha-arrest #viral-tweets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి