విజయనగరం West Bengal: జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం.. హంతకుడికి ఉరిశిక్ష ! పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. హంతకుడికి ఉరిశిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: నీళ్లు అడిగిన భర్త తల పగలగొట్టిన భార్య.. మెదడు బటయకు తీసి! భోజనం చేస్తూ నీళ్లు ఇవ్వమని అడిగిన భర్త సత్యపాల్ ను భార్య సావిత్రి దారుణంగా చంపేసిన ఘటన యూపీలో జరిగింది. ఇటుకతో తల పగిలేలా కొట్టిన సావిత్రి.. భర్త డెడ్ బాడీపై కూర్చొని మెదడును బయటకు తీసి విసిరేసింది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Srinagar: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు సైనికులు మృతి! జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ అటవి ప్రాంతంలో భీకరమైన కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సినిమా స్టైల్లో భర్తను హత్య చేయించిన భార్య .. మెడకు తాడు బిగించి.. ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరేంద్రను భార్య హత్య చేయించింది. కిరాయి ముఠాకు రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. హత్య చేసిన అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. నిందితులు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cyber Crime: అమాయకులే టార్గెట్.. నమ్మించి నట్టేటా ముంచుతున్న కేటుగాళ్లు! అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగులు, రేప్, డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్న వారిని బెదిరిస్తూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా రూ.70 లక్షలకు పైగా కొట్టేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet: ఆరుగురు దొంగలు అరెస్ట్.. రూ. 30 లక్షలు విలువ చేసే.. సూర్యాపేట జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 30 లక్షలు విలువ చేసే 35.4 తులాల బంగారు, 10 తులాల సిల్వర్ ఆభరణాలు, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..! ఏలూరు జిల్లా భీమడోలులో తన ప్రియుడి కోసం ఓ ప్రియురాలు ఆందోళన చేపట్టింది. పొలాసానిపల్లికు చెందిన రావికుమార్(25) పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని నిరసన చేపట్టింది. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Malla Reddy Agriculture University : మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత! మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8 2024 అరుణ్ అనే విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపాయి. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే? ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అరెస్ట్ అయ్యారు. ఆహార తనిఖీ అధికారులమంటూ నగరంలోని కింగ్ దర్బార్ హోటల్లో ఆకస్మిక తనిఖీ చేసి హల్చల్ చేశారు. విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన హోటల్ యజమాని వారిని అరెస్ట్ చేయించారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn