పది కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా.. హర్షసాయి సంచలన ఆడియో లీక్!

యూట్యూబర్ హర్షసాయి మరో ఆడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 'రూ.10 కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా. నా బ్రాండ్ వాల్యూ తగ్గించుకోను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంతైనా ఇస్తారు. ఈ విషయం ఎవరి వద్ద డిస్కస్ చేయకు' అంటూ హర్ష మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. 

New Update
drerer

Harsha Sai: యూట్యూబర్ హర్షసాయికి సంబంధించిన మరో సంచలన ఆడియో బయటకొచ్చింది. తన విలువ రూ.10 కోట్లు అని, అడిగినంత ఇస్తే ఏమైనా చేస్తానంటూ చెప్పిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు 'నా వాల్యూ పది కోట్ల రూపాయలు. రూ.10 కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా. నా బ్రాండ్ వాల్యూ తగ్గించుకోను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంతైనా ఇస్తారు. అయినా నేను కాకపోతే మరొకరితో ప్రమోట్ చేయించుకుంటారు. ఈ విషయం ఎవరి వద్ద డిస్కస్ చేయకు' అంటూ హర్ష మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 

ఇదిలా ఉంటే.. పరారిలో ఉన్న హర్ష బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 4 ఎస్‌వోటీ పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.  హర్షసాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఇక హర్షసాయి తెరకెక్కించిన 'మెగా' అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన 'మిత్ర శర్మ' తనమీద అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేస్తూ వీడియో రికార్డు చేసినట్లు తెలిపింది. అంతేకాదు దాన్ని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే దీనిపై స్పందించిన హర్ష.. అవన్నీ తప్పుడు ఆరోపణలు, కేవలం డబ్బు కోసమే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తుందన్నాడు. 

Also Read :  గ్రూప్​-1 అభ్యర్థులకు షాక్.. పరీక్ష మళ్లీ రద్దు అవుతుందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

పోర్న్ వీక్షకులకు పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌ కేంద్రంగా 3 నెలల్లోనే 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. పిల్లల పోర్న్ చూసిన, షేర్ చేసిన కేసులు తప్పవంటున్నారు.

New Update
porn cases

Telangana Police special focus on child pornography

Pornography: పోర్న్ వీక్షకులకు పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇంటర్‌నెట్‌, సోషల్ మీడియా మాధ్యమాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీని చూసినా, పోస్ట్ చేసినవారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్ పోర్టల్.. చిన్నపిల్లల అశ్లీల వీడియోల క్రియేటింగ్, షేరింగ్, సర్క్యులేటింగ్ చైల్డ్ ఎబ్యూజ్ మెటీరియల్‌లకు పాల్పడే వారిని సులభంగా గుర్తిస్తోంది. ఐపీఅడ్రస్, ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ల వివరాలను సెకరించి ఆయా జిల్లాల సీఐడీ అధికారులకు పంపించి.. సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. 

నిందితుల్లో యువకులే అధికం..

ఇటీవల హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన కేసుల్లో ఆరుగురు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు 3 నెలల్లోనే 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుల్లో యువకులే అధికంగా ఉంటున్నట్లు చెప్పారు. కొంతమంది నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారని, పేరు, వివరాలు గుర్తించలేరనే ఉద్దేశంతో టెలీగ్రామ్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు చేరవేసుకుంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కొందరి ఐపీ అడ్రస్‌తో అసలు నిందితులెవరనేది పోలీసు, నిఘావర్గాలు గుర్తిస్తాయనేది అంచనా వేయలేక.. కేసుల్లో ఇరుక్కుని ఆందోళన చెందుతున్నారు. 

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

కేసులు పెట్టొద్దంటూ క్షమాపణలు..

విద్యారులు, ఉద్యోగార్థులు, పెళ్లీడు యువకులు చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసుల్లో ఇరుక్కుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కేసులు పెట్టొద్దంటూ పోలీసులకు క్షమాపణలు కోరుతున్నాని, పలు సాక్ష్యాల ఆధారంగా కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు ఏం చూస్తున్నారనేది గమనించాలని పేరెంట్స్ కు సూచిస్తున్నారు. నిషేధిత వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని, ఇంటర్ నెట్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తరచూ పరిశీలించాలంటున్నారు. వారిపై నిఘా ఉంచామనే అనుమానం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించి వారిని తప్పుదోవపట్టకుండా జాగ్రత్తపడాలంటున్నారు. 

Also : BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’



porn-movies | child | police | cases | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment