/rtv/media/media_files/2025/02/06/ljMvPezcnX9DqjnBRzqc.jpg)
tamil nadu husband
తమిళనాడులో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తతో ఇళ్లును అమ్మంచి వచ్చిన రూ.33లక్షలతో తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో చోటుచేసుకుంది. బెంజమిన్ (47), సునీత (45) దంపతులకు 2006లో పెళ్తైంది. వీరికి పిల్లలు లేరు. బెంజమిన్ సౌదీ అరేబియాలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేస్తుండగా.. సునీత సొంతూరిలో ఉండేది. ఈ క్రమంలో ఆమెకు సైజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరు కలిసి ఎక్కడికైనా పారిపోవాలని అనుకుని ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం.. డబ్బు అవసరమని చెప్పి పూర్వీకుల ఇంటిని భర్తతోనే అమ్మించింది సునీత. వచ్చిన డబ్బులతో ప్రియుడితో ఊడాయించి ఆ తరువాత ఫోన్ స్వీఛాప్ చేసింది. నెల రోజుల పాటు భార్య ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో సౌదీ నుంచి ఇంటికి వచ్చిన బెంజమిన్ విచారణ చేయగా.. అసలు విషయం బయటపడింది.
ఈ విషయం తెలుసుకున్న భర్త మనస్తాపం చెంది సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు సునీత, ఆమె ప్రియుడు సైజు, ఆమె సోదరి షీలా కారణమని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సునీత, ఆమె లవర్ కోసం గాలిస్తున్నారు.
సరిగ్గా రెండు రోజుల క్రితం
సరిగ్గా రెండు రోజుల క్రితం ఇలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ లో జరిగింది. కుమార్తె చదువు కోసం అని చెప్పి భర్త కిడ్నీని అమ్మేసి ప్రియుడితో పారిపోయింది ఓ మహిళ. భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసి .. రాత్రికి రాత్రే ప్రియుడితో పరారైంది. ఫేస్ బుక్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడగా అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనిపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read : గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!