/rtv/media/media_files/2026/05/24/sangareddy-2026-05-24-14-28-33.jpg)
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ దారుణమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
సంగారెడ్డి జిల్లా గంగాపూర్‌కు చెందిన ముత్యంరెడ్డికి, కల్పన అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కల్పన నారాయణఖేడ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు చింటూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత కొంతకాలంగా వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా తిరుగుతున్నారు.
తమ బంధానికి ముత్యంరెడ్డి అడ్డుగా ఉన్నాడని కల్పన, చింటూ భావించారు. ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని ఇద్దరూ కలిసి ఒక పక్కా ప్లాన్ వేశారు. పథకం ప్రకారం.. ఎల్గోయి శివారు ప్రాంతంలో ముత్యంరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, శవాన్ని అక్కడే ఒక గుంత తవ్విJCBతో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ముత్యంరెడ్డి కనిపించడం లేదంటూ నాటకమాడారు.
పోలీసులకు ఫిర్యాదు
దాదాపు 9 రోజుల క్రితం ముత్యంరెడ్డి మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా కల్పన, చింటూల ప్రవర్తనపై అనుమానం వచ్చింది. వారిని గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపడింది. నిందితులు ఇద్దరూ కలిసి ముత్యంరెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టినట్లు ఒప్పుకోవడంతో, పోలీసులు కల్పన , ఆమె ప్రియుడు చింటూలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Follow Us