వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే బ్యాంక్ ఉద్యోగిని కారులో హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. హన్మకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన రాజా మోహన్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు రాజాను తన కారులోనే హత్య చేశారు. కాళ్లు, చేతులకు తాళ్లు కట్టి అతన్ని హత్య చేశారు. ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!? ఇనుప గొలుసులతో కట్టేసి.. ఇంతటితో ఆగకుండా ఇనుప గొలుసులతో తన కార్‌లోనే రాజా మోహను బంధించడంతో వరంగల్ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. కారులో మృతదేహం ఉన్నట్లు ఈ రోజు కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు! ఈ రోజు వేకువ జామున 3:49 గంటల ప్రాంతంలో కారును రంగంపేటలో ఓ వ్యక్తి పార్క్ చేసినట్లు సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. రాజా మోహన్ హత్యకు గురయ్యారని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అతన్ని ఎవరూ హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కారు దగ్గర ఓ వ్యక్తి బ్లాక్ స్వెట్టర్ ధరించి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనే రాజా మోహన్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం! ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి బానోత్ తనూష్ నాయక్(16) ఆత్మహత్య చేసుకున్నాడు . సీఐ రాజు వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం బాత్‌రూంలోకి వెళ్ళి ఎంత సేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి పరిశీలించారు. తనూష్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్ల గుర్తించారు. పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. అయితే ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమని సమాచారం. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం!