అపార్ట్మెంట్ లో ఆడుకుంటుండగా ఘోర ప్రమాదం! ఐదేళ్ల చిన్నారి స్పాట్ డెడ్

పండగ వేళ విశాఖపట్నం గాజువాక పరిధిలోని సెలస్ట్ అపార్ట్మెంట్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ సెల్లార్ లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆ చిన్నారి మృతి చెందింది.

New Update
Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam:  సంక్రాంతి పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లిన ఆ కుటుంబానికి కూతురి మరణంతో  తీరని విషాదం మిగిలింది. అపార్ట్మెంట్ సెల్లార్ సరదాగా ఆడుకుంటున్న ఆ చిన్నారిని  కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది.  దీంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నం గాజువాక పరిధిలో చోటుచేసుకుంది. 

నిర్లక్ష్యమే కారణం.. 

స్థానికుల వివరాల ప్రకారం.. సుజాతనగర్ కు చెందిన దంపతులు పిల్లలతో కలిసి గాజువాక పరిధిలోని  సెలస్ట్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న తమ బంధువుల ఇంటికి సంక్రాంతి పండక్కి వచ్చారు. ఈ క్రమంలో తమ పిల్లలు అపార్ట్మెంట్ లోని సెల్లార్ లో ఆడుకుంటుండగా అటు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వెంటనే ఆ చిన్నారిని కిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఫార్మా కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి  నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

కాకినాడలో మరో ప్రమాదం 

ఇది ఇలా ఉంటే ఏపీలోని కాకినాడ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. ప్రతిపాడు మండలం ఒమ్మంగి శివారులో అదుపు తప్పిన మినీ వ్యాన్ లోయలో పడిపోవడంతో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. సంక్రాంతి పండగ నేపథ్యంలో  కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఓ వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 20 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.  పండగ వేళ ఇలా జరగడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

Also Read: Daaku Maharaaj Day 1 Collections: 'డాకూ మహారాజ్' బాక్స్ ఆఫీస్ ఊచకోత.. తొలి రోజే ఎన్ని కోట్లంటే !

Also Read: Sankranti 2025: మకర సంక్రాంతికి సరైన పూజ సమయాలివే.. ఆ రోజు ఈ పనులు తప్పక చేయాలి

Advertisment
Advertisment
Advertisment