కానిస్టేబుల్‌ కాదు కామాంధుడు.. రేప్ చేశాడని కేసు పెట్టాడానికి వెళ్తే  మళ్లీ రేప్ చేశాడు!

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడో కానిస్టేబుల్ బాధితురాలని నమ్మించి తిరిగి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కానిస్టేబుల్ తో పాటుగా మరోకరిని అరెస్ట్ చేశారు.  

New Update
rape Karnataka

కర్ణాటకలో దారుణం జరిగింది.  ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడో కానిస్టేబుల్ బాధితురాలని నమ్మించి తిరిగి అత్యాచారం చేశాడు.  బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బొమ్మనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్ తో పాటుగా మరోకరిని అరెస్ట్ చేశారు.  

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం17 ఏళ్ల మైనర్ బాధితురాలు బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ఆమెకు తన ఇంటి పొరుగున ఉన్న వివాహితుడైన విక్కీతో పరిచయం ఏర్పడింది.  విక్కీ మైనర్‌ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.  ఆ తరువాత ముఖం చాటేశాడు. బాధితురాలు తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది.  దీంతో బాధితురాలి తల్లి బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

విచారణ క్రమంలో కానిస్టేబుల్ అరుణ్ బాధితురాలితో స్నేహం పెంచుకున్నాడు.  ఆమెకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు అంతేకాకుండా తనకు తెలిసిన వాళ్ల దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆమెను బెంగళూరులోని ఒక హోటల్‌కు పిలిపించి కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపాడు. మత్తులోకి జారుకున్నాక  ఆమెపై అత్యాచారం చేశాడు.  

చెబితే చంపేస్తా

ఆ తరువాత  ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే చంపేస్తానని, అంతేకాకుండా ఆమె ప్రైవేట్ వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తానని హెచ్చరించారు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పడంతో  ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కానిస్టేబుల్ అరుణ్ తో పాటుగా విక్కీని అదుపులోకి తీసుకున్నారు.  ఇద్దరిపైనా పోక్సో చట్టం 2012 (U-4.6.10.12.15), భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 (U/s-64(1),64(2)(a).351(3)) కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.

Also Read :  చంద్రబాబుకు హ్యాట్సాఫ్‌ ..గవర్నర్కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

తైవాన్‌కి చెందిన ఎన్వీ(57) అతని మాజీ ప్రియురాలిని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆమె తండ్రి అస్థికలు దొంగలించాడు. ఆమె మళ్లీ కలిస్తేనే అస్తికలు ఇస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఎల్వీని అరెస్ట్ చేసి అస్థికలను ఆమెకి ఇచ్చేశారు.

New Update
Ashes

Ashes Photograph: (Ashes )

తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వ్యక్తి ఓ ప్లాన్ వేశాడు. ఆమె తండ్రి అస్థికలు దొంగలించి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయంగా ఫిభ్రవరిలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తైవాన్‌కు చెందిన ఎల్వి(57) అనే వ్యక్తి అతని మాజీ ప్రియురాలి తండ్రి అస్థికలను దొంగిలించాడు. 15 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2023లో ఎల్వీ, టాంగ్(48) మధ్య లవ్ బ్రేక్‌అప్ అయ్యింది. గత కొన్ని నెలల క్రితం టాంగ్ తండ్రి చనిపోయారు. ఆమె తన తండ్రి అంత్యక్రియల తర్వాత అస్థికలను జాగ్రత్తగా భద్రపరిచింది. 2023మేలో ఎల్వీ వాటిని దొంగలించాడు. 2025 లవర్స్ డే రోజు ఎల్వీ.. టాంగ్‌కు ఆమె తండ్రి అస్థికలు ఉన్న కలశం ఫొటో పంపాడు. ఆమె తిరిగి అతన్ని కలవడానికి అంగీకరిస్తేనే ఆ అస్థికలు ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఎల్వి 2023లో టాంగ్‌తో ఉన్న రిలేషన్‌ను కట్ చేసుకున్నాడు. 

Also read: Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఎల్వీకి ఆమెతో విడిపోవడం ఇష్టం లేదు. తరువాతి రెండేళ్లలో టాంగ్‌ను పదే పదే ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. మే 2023లో అతను టాంగ్ తండ్రి అస్థికలు ఉంచబడిన స్మశానవాటికను సందర్శించడం ప్రారంభించాడు. ఆమెను మానసికంగా ఒత్తిడి చేయడానికి ఆ కలశం దొంగిలించాలని అతను ప్లాన్ చేశాడు. టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అస్థికలు ఉన్న కలశం కోసం వెతకడం ప్రారంభించారు. ఎల్వీ కోళ్ల ఫారంలో అస్థికలు ఉన్న కలశం లభించింది. మార్చి 28న పోలీసులు ఆ పాత్రను స్వాధీనం చేసుకుని శ్రీమతి టాంగ్‌కు తిరిగి ఇచ్చారు.  ఎల్వి ఇప్పటికే సంబంధం లేని చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలపై జైలులో ఉన్నాడు. 

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Advertisment
Advertisment
Advertisment